కాంతార ఎఫెక్ట్.. సంచలన నిర్ణయం తీసుకున్న కర్ణాటక ప్రభుత్వం?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా కాంతారా సినిమా గురించే వార్తలు వినిపిస్తున్నాయి.

భాషతో సంబంధం లేకుండా ఈ సినిమా విడుదలై అన్ని భాషల్లో కూడా ఒకే విధంగా రెస్పాన్స్ ను అందుకోవడం మాత్రమే కాకుండా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తూ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతోంది.

రిషబ్‌ శెట్టి దర్శకత్వంలో దొరికేక్కిన ఈ సినిమా కర్ణాటకలోని ఆదివాసి సంస్కృతిని సాంప్రదాయాన్ని భూత కోలా నృత్య కళాకారులను తెరపై చూపించిన తీరు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.ఆ పాత్రలో రిషబ్‌ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్‌లో మంచి కలెక్షన్లలో దూసుకెళ్తుంది.అంతేకాకుండా గత సినిమాల కలెక్షన్ ల రికార్డులను కూడా బద్దలు కొడుతూ కొత్త రికార్డులను సృష్టిస్తోంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.ఈ సినిమాపై కర్ణాటక ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది.

Advertisement
Kantara Success Karnataka Govt Announces Allowances For Daiva Narthakas Details,

ఈ సినిమా విడుదల తర్వాత కర్ణాటక ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంటూ 60 ఏళ్లు దాటిన భూత కోలా నృత్యకారులకు ఆర్థిక సహాయం అందించనున్నట్టు తెలిపింది.అర్హులైన వారికి నెలకు రూ.2000 చొప్పున అందించనున్నట్లు కర్ణాటక ప్రభుత్వం తెలిపింది.

Kantara Success Karnataka Govt Announces Allowances For Daiva Narthakas Details,

కాగా ఇదే విషయాన్ని బెంగళూరు సెంట్రల్‌ ఎంపీ పీసీ మోహన్‌ ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.దైవారాధన, భూత కోలా నృత్యం చేస్తూ జీవనం సాగిస్తున్న వారికి బీజేపీ నేతృత్వంలోని కర్ణాటక సర్కార్‌ ప్రతి నెలా రూ.2000 అలవెన్స్‌ అందిస్తుందని వెల్లడించారు.హిందూ ధర్మంలో భాగంగా భూత కోలా ప్రత్యేక దైవారాధనగా ఉంది.

భూత కోలా నృత్యకారులకు భత్యం ఇచ్చేందుకు అంగీకరించిన ముఖ్యమంత్రి బస్వరాజ్‌ బొమ్మైకి, మంత్రి సునీల్‌ కుమార్‌ కాకర్లకు కృతజ్ఞతలు అని పీసీ మోహన్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.ఇందుకు సంబంధించిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ప్రభాస్ నో చెబితే బన్నీ సక్సెస్ సాధించిన సినిమా ఇదే.. ఆ బ్లాక్ బస్టర్ వెనుక కథ తెలుసా?
Advertisement
" autoplay>

తాజా వార్తలు