కన్నప్ప సినిమా నుంచి ప్రభాస్ కి స్పెషల్ బర్త్ డే విషెస్... పోస్టర్ వైరల్!

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ( Prabhas ) పుట్టినరోజు( Birthday ) కావడంతో సోషల్ మీడియా మొత్తం ప్రభాస్ పేరు ట్రెండ్ అవుతుంది.

ఎంతోమంది అభిమానులు ప్రభాస్ కి సంబంధించినటువంటి రేర్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పెద్ద ఎత్తున ప్రభాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇక ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో ఈయన నటిస్తున్నటువంటి సినిమాల నుంచి కూడా అప్డేట్స్ విడుదల చేశారు అలాగే ఎంతో మంది సినీ సెలెబ్రిటీలు అభిమానులు ఈయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఈ క్రమంలోనే భక్తకన్నప్ప ( Kannappa ) సినిమా టీం నుంచి కూడా ప్రభాస్ కి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్టర్ విడుదల చేశారు.

ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ గా మారింది.

Kannappa Team Special Wishes To Prabhas On His Birthday Special Poster Goes Vira

ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా భక్తకన్నప్ప సినిమా నుంచి పోస్టర్ విడుదల చేస్తూ.ప్రభంజనమైన ప్రేక్షక హృదయాలను మనసుతో, వ్యక్తిత్వంతో, నటనతో గెలుచుకొని ప్రపంచమంతా శభాష్ అనిపించుకుంటున్న మా ప్రభాస్ కి జన్మదిన శుభాకాంక్షలు శతమానం భవతి శత శతమానం భవతి అంటూ వివిధ రకాల ప్రభాస్ ఫోటోలతో ఉన్నటువంటి పోస్టర్ విడుదల చేశారు ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అయితే మంచు విష్ణు( Manchu Vishnu )డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి భక్తకన్నప్ప సినిమాలో ప్రభాస్ నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో వివిధ భాష సెలబ్రిటీలందరూ కూడా ఈ సినిమాలో భాగమవుతున్నారు.

Kannappa Team Special Wishes To Prabhas On His Birthday Special Poster Goes Vira
Advertisement
Kannappa Team Special Wishes To Prabhas On His Birthday Special Poster Goes Vira

పరమశివుడికి భక్తుడు అయినటువంటి భక్తకన్నప్ప పాత్రలో నటించాలన్నది మంచు విష్ణు కోరిక ఈ క్రమంలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ పనులు జరుగుతున్నాయి.ఇందులో మంచు విష్ణు భక్తకన్నప్ప పాత్రలో నటించగా ప్రభాస్ శివుడి పాత్రలో నటించబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.ఇక ఈ సినిమాకు మహాభారతం టీవీ సీరియల్ ఫేమ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా ఈ చిత్రాన్ని ఆవా ఎంటర్టైన్మెంట్స్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఎంతో సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..

Advertisement

తాజా వార్తలు