తారక్ ను చూడగానే ఆ నటుడు గుర్తుకు వచ్చారు... ఎలాంటి యాటిట్యూడ్ లేదు: దేవర నటుడు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ( NTR ) ప్రస్తుతం కొరటాల శివ ( Koratala Shiva )దర్శకత్వంలో తెరకెక్కుతున్నటువంటి దేవర( Devara ) అనే పాన్ ఇండియా సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో ఇతర భాష సెలబ్రిటీలు కూడా ఈ సినిమాలో భాగమైన సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే కేజిఎఫ్ సినిమాలో దయా పాత్రలో నటించి అందరిని మెప్పించిన తారక్ పొన్నప్ప కూడా ఈ సినిమాలో భాగమైన సంగతి తెలిసిందే.

తాజాగా తారక్ పొన్నప్ప( Tarak ponnappa ).ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

తారక్ ను నేను కలిసినప్పుడు నన్ను చాలా మనస్ఫూర్తిగా విష్ చేశారని తెలిపారు.ఎన్టీఆర్ అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారని ఆయన యాటిట్యూడ్ చూపించరు అంటూ తారక్ పొన్నప్ప ఎన్టీఆర్ గురించి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.ఇక ఎన్టీఆర్ తో షూటింగ్ చాలా కంఫర్టబుల్గా ఉంటుందని తెలిపారు.

ఎన్టీఆర్ గారిని చూడగానే తనకు కన్నడ పవర్ స్టార్ దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ ( Puneeth Raj Kumar ) గుర్తుకు వచ్చారని, వీరిద్దరి క్యారెక్టర్లలో సిమిలారిటీస్ కనిపిస్తాయని చెప్పుకొచ్చారు తారక్ పొన్నప్ప జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి.

Advertisement

ఇలా ఎన్టీఆర్ గురించి తారక్ పొనప్ప చేసినటువంటి ఈ ఎన్టీఆర్ ఫాన్స్ ఫిదా అవుతున్నారు.ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ఈయన ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్నారు జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాపై కూడా భారీ స్థాయిలోనే అంచనాలు పెరిగాయి.ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది.

ఇక ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్( Prashanth Neel ) దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నారు.

ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!
Advertisement

తాజా వార్తలు