కంగువ మూవీ స్టోరీ ఇదేనా.. సూర్య వర్సెస్ సూర్య అనే విధంగా ఉండబోతుందా?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య( Surya ) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కంగువ.ఈ సినిమాకు శివ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.

ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్ యువి క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.ఇంకా షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమాలో దిశాపటాని( Disha Patani ) హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే.అలాగే బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు.

ఇటీవల విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Advertisement

కాగా కంగువ సినిమా( kanguva movie ) మొదట నుంచి పీరియడ్ యాక్షన్ ఫిల్మ్ గా ప్రచారం పొందింది.కానీ ఇది పూర్తి పీరియడ్ ఫిల్మ్ కాదట.కంగువ అనేది టైం ట్రావెల్ నేపథ్యంలో సాగే ఫాంటసీ సినిమా అని తెలుస్తోంది.ఈ కథ 1670 ప్రాంతంలో అలాగే వర్తమానంలో జరగనుందట.1670 లలో క్రూరమైన ట్రైబల్ వారియర్ గా సూర్య కనిపించనున్నాడట.అయితే టైం ట్రావెల్ చేసి సూర్య ప్రజెంట్ లోకి వస్తాడట.

కాగా ఈ సినిమాని 2024 లోనే విడుదల చేయనున్నట్లు తెలుపుతూ తాజాగా మరో పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్.ఆ పోస్టర్ సూర్య వర్సెస్ సూర్య అన్నట్టుగా ఉంది.

ఒక వైపు కత్తి పట్టుకొని వారియర్ గా, మరోవైపు గన్ పట్టుకొని గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తున్నాడు సూర్య.ఈ సినిమా ట్రావెల్ ట్రావెల్ నేపథ్యంలో ఉండనుందనే వార్తలకు తాజా పోస్టర్ బలం చేకూరుస్తోంది.ట్రైబల్ వారియర్ అయిన సూర్య టైం ట్రావెల్ చేసి, వర్తమానంలో గ్యాంగ్ స్టార్ గా ఉన్న సూర్యతో తలపడనున్నాడని అర్థమవుతోంది.

తాజాగా విడుదల చేసిన పోస్టర్ తో అంచనాలు కాస్త మరింత పెరిగాయి.

పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?
Advertisement

తాజా వార్తలు