జిమ్ ట్రైయినర్‌గా కంగారూ.. దగ్గరుండి మరీ పుషప్స్..

ఆస్ట్రేలియా దేశ నేషనల్ యానిమల్ కంగారూలను.చూసి జనం ముచ్చటిపడిపోతుంటారు.కంగారూలు శాకాహార జంతువులే అయినప్పటికీ చాలా వేగంగా పరిగెత్తగలవు.

ఈ సంగతులు అలా ఉంచితే.ఓ కంగారూ చేసిన ఫన్నీ వర్క్‌కు సంబంధించిన వీడియో ఒకటి ప్రజెంట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

సదరు వైరల్ వీడియోలో కంగారూ చేసిన పనిని చూసి నెటిజన్లు దానిని తెగ మెచ్చుకుంటున్నారు కూడా.ఇంతకీ వీడియోలో కంగారూ ఏం చేసిందంటే.ట్విట్టర్ యూజర్ భూటెన్‌ జెబైడెన్ తన అకౌంట్‌లో షేర్ చేసిన ఈ వీడియోకు ‘పర్సనల్ ట్రెయినర్’ అనే క్యాప్షన్ ఇచ్చారు.

కాగా, వీడియోలో కంగారూ పర్సనల్ ట్రెయినర్ మాదిరిగానే.పుషప్స్ చేయిస్తోంది.

Advertisement

ఓ వ్యక్తికి జిమ్ ట్రెయినర్‌గా మారిన కంగారూ.అలా చక్కగా పుష్ అప్స్ చేయిస్తూ చక్కగా ఫోజులిస్తోంది.

జనరల్‌గా జిమ్‌లో ట్రెయినర్స్ ఏ విధంగా ఫోజులిస్తారో.అలాగే కంగారూ ఫోజు కొడుతుండటం విశేషం.

ఏదేని జిమ్ కు వెళ్తే అక్కడి జిమ్ ట్రెయినర్స్ తాము ఇచ్చే ట్రైయినింగ్స్ గురించి చెప్తుంటారు.ఈ క్రమంలోనే వ్యక్తులకు ఇచ్చే ట్రెయినింగ్ చూపిస్తుంటారు కూడా.

ఆ మాదిరిగానే కంగారూ సదరు వ్యక్తికి పుషప్స్ ట్రెయినింగ్ ఇస్తున్నట్లు వీడియో చూస్తుంటే అనిపిస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

ఇకపోతే సదరు వ్యక్తి పుషప్స్ చేస్తుండగా కౌంట్ చేస్తున్నట్లుగా, అతని భుజం మీద తన ముందరి రెండు కాళ్లు ఉంచింది.ఆ తర్వాత హ్యాపీగా అతన్ని చూస్తోంది కూడా.కంగారూ చేసిన ఈ పనిని చూసి నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు కూడా.

Advertisement

నెటిజన్లు ఈ వీడియో చూసి వెరీ ఫన్నీ అని కామెంట్స్ చేస్తున్నారు.ఓ ఫ్రెండ్ మాదిరిగా బుల్లి కంగారూ హెల్ప్ చేస్తోందని పోస్టులు పెడుతున్నారు.

కంగారూ భలే అందంగా ఉందని ఇంకొందరు నెటిజన్లు అంటున్నారు.

తాజా వార్తలు