కంగనా రనౌత్ ఇంటి విలువ అన్ని కోట్లా..?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన కంగనా రనౌత్ ఒకవైపు వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉంటూ మరోవైపు వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.అయితే ఈ స్టార్ హీరోయిన్ కు మనాలీ ప్రాంతంలో ఒక ఇల్లు ఉన్న సంగతి తెలిసిందే.

దాదాపు 30 కోట్ల రూపాయలు కంగనా రనౌత్ ఈ ఇంటి కోసం ఖర్చు చేశారు.2018 సంవత్సరంలో కంగనా రనౌత్ ఈ ఇంట్లోకి గృహ ప్రవేశం చేశారు.ఈ ఇంట్లో ఏడు బెడ్ రూమ్ లు, ఏడు బాత్ రూమ్ లు, విశాలంగా ఉన్న హాల్ తో పాటు ఈ ఇంట్లో అన్ని సదుపాయాలు ఉన్నాయి.

ఈ ఇంటి కిటికీల నుంచి బయటకు చూస్తే హిమాలయాలు అతి దగ్గరగా కనిపిస్తాయి.కంగనా రనౌత్ ఇంటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఆ ఫోటోలను చూసి నెటిజన్లు సైతం అవాక్కవుతున్నారు.

ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ లలో ఒకరైన శబ్నం గుప్తా కంగనా ఇంటిలోని ప్రతి గది అందంగా ఉండేలా ఎన్నో జాగ్రత్తలు తీసుకుని నిర్మాణం చేపట్టారు.షూటింగ్ ముగించుకుని ఇంటికి వచ్చిన తరువాత ప్రశాంతంగా రెస్ట్ తీసుకునే విధంగా కంగనా రనౌత్ ఇంటి బెడ్ రూమ్ ఉండటం గమనార్హం.

ఇంటి లోపల ఉండే మెట్లు రిచ్ లుక్ లో కనిపించే విధంగా కంగనా ఏర్పాట్లు చేసుకున్నారు.ఇంటిలోని గోడలపై కంగనా స్వయంగా వేసిన పెయింటింగ్ లు దర్శనమిస్తాయి.

Advertisement

పుస్తకాలు చదవడాన్ని ఎక్కువగా ఇష్టపడే కంగనా లివింగ్ రూమ్ లో ఉండే ప్రతి షెల్ఫ్ లో బుక్స్ ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు.కంగనా ఒక గదిని ప్రత్యేకంగా అద్దాలతో డిజైన్ చేయించుకున్నారు.

ఆ గది అంతా ఎక్కడ చూసినా అద్దాలు మాత్రమే కనిపిస్తాయి.కంగనా రనౌత్ విలాసవంతమైన ఇంటికి సంబంధించిన ఫోటోలను చూసి కంగనా ఇల్లు సకల సౌకర్యాలతో ఆకర్షణీయంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు