ఆర్ఆర్ఆర్ సినిమా చూడకుండానే రాజమౌళిపై ప్రశంసలు కురిపించిన కంగనా!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ఎంతో మంది సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమాకి కేవలం దక్షిణాది రాష్ట్రాలలో మాత్రమే కాకుండా ఉత్తరాది రాష్ట్రాలలో సెలబ్రిటీల నుంచి కూడా ప్రశంసలు అందుతున్నాయి.ఇకపోతే తాజాగా ఈ సినిమాపై కాంట్రవర్సి బ్యూటీ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు సంచలన వ్యాఖ్యలు చేసే ఈమె నోటిగుండా రాజమౌళి పై విమర్శలు రావడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.ఈ సందర్భంగా కంగనారనౌత్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక పోస్ట్ షేర్ చేస్తూ రాజమౌళి పై ప్రశంసలు కురిపించారు.

ఈ సందర్భంగా ఆమె స్పందిస్తూ రాజమౌళి ఒక గొప్ప భారతీయ సినీ దర్శకుడు అంటూ అతని పై ప్రశంసలు కురిపించారు అదే విధంగా అతని సక్సెస్ కాదు, ఒక కళాకారుడిగా అతని వినయం.వ్యక్తిగా సింప్లిసిటీ, అతని దేశం, ధర్మం పట్ల అతనికి ఉన్న గొప్ప ప్రేమ.

Advertisement
Kangana Praises Rajamouli Without Watching Rrr Movie , Rajamouli , Rrr , Kangana

 మీలాంటి రోల్ మోడల్ ను కలిగి ఉండటం నిజంగా గొప్ప విషయం సర్.ఇట్లు మీ అభిమాని కంగనారనౌత్ అంటూ పోస్ట్ చేశారు.

Kangana Praises Rajamouli Without Watching Rrr Movie , Rajamouli , Rrr , Kangana

ఈ విధంగా రాజమౌళి గురించి కంగనా రనౌత్ ఇలాంటి ప్రశంసల వర్షం కురిపించడంతో ఈ పోస్ట్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.అయితే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమా ఇప్పటి వరకు చూడకుండానే డైరెక్టర్ రాజమౌళి పై కంగనా రనౌత్ ఇలా ప్రశంసలు కురిపించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.ఇప్పటి వరకు కంగనారనౌత్ రాజమౌళి దర్శకత్వంలో ఎలాంటి సినిమాలు చేయక పోయినప్పటికీ అతనిలో ఉన్న టాలెంట్ గుర్తించిన ఈ ముద్దుగుమ్మ రాజమౌళి పై ప్రశంసల వర్షం కురిపించారు.

ప్రస్తుతం కంగనా చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటలు విని ఎంతో సంతోషించాను.. నాగచైతన్య కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు