పుష్పని చూసి ఎంజాయ్ చేసిన కమల్ హాసన్..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాని ఓన్ గా చూసుకున్నారు సెలబ్రిటీలు.

సినిమాకు వస్తున్న టాక్ ని చూసి సెలబ్రిటీస్ తామంతట తామే చూసి పుష్ప టీం కు స్పెషల్ కంగ్రాట్స్ మెసేజ్ చేస్తున్నారు.

ఇప్పటికే బాలీవుడ్ హీరోలు, దర్శకులతో పాటుగా తమిళ హీరోలు, దర్శకులు పుష్ప సినిమాపై తమ కామెంట్ పెట్టారు.ఇక ఇప్పుడు లేటెస్ట్ గా పుష్ప సినిమా చూసి ఎంజాయ్ చేశారు కమల్ హాసన్.

పుష్ప సినిమాని దేవి శ్రీ ప్రసాద్ తో కలిసి కమల్ హాసన్ చూశారు.సినిమా చూసి కమల్ పూర్తిగా ఎంటర్టైన్ అయ్యారని తెలుస్తుంది.

కమల్ హాసన్ ఈ సినిమా చూసినందుకు అల్లు అర్జున్ తన ట్విట్టర్ లో థ్యాంక్స్ అని కామెంట్ పెట్టాడు.పుష్ప సినిమా అల్లు అర్జున్ కి నేషనల్ వైడ్ గా భారీ క్రేజ్ తెచ్చింది.

Advertisement

పుష్ప పార్ట్ 1 అంచనాలను అందుకోగా పార్ట్ 2 అంతకుమించి అనిపించేలా తెరకెక్కించాలని చూస్తున్నారు.మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ అద్భుతాలు సృష్టించింది.

సినిమాలో శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన్న కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అదరగొట్టింది.

Advertisement

తాజా వార్తలు