ఏపీ సీఎం జగన్ చేసిన పనికి ధన్యవాదాలు తెలిపిన కమల్ హాసన్... ఎందుకో తెలుసా...?

ఎస్.పి.

బాలసుబ్రహ్మణ్యం గారి అంత్యక్రియలు జరిగిన తర్వాత.

తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు.ఆ లేఖలో భారత చలన చిత్ర పరిశ్రమలో లెజెండ్రీ సింగర్ గా పేరు పొందిన ఎస్పీ బాలసుబ్రమణ్యం గారికి భారతదేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నతో గౌరవించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.50 సంవత్సరాలకు పైగా దేశంలోని అనేక చిత్రపరిశ్రమలో ఆయన సేవలు అందించడం నేపథ్యంలో ఈ అరుదైన గౌరవానికి బాలసుబ్రమణ్యం అర్హుడు అని ఆయన అభిప్రాయపడ్డారు.కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖ ద్వారా జగన్ కు అనేక మంది నుండి ప్రశంశలు పొందారు.

అయితే ఇదే విషయంపై తమిళ స్టార్ నటుడు, జాతీయ నటుడైన కమల్ హాసన్ సైతం సీఎం జగన్ లేక పై ఆనందం వ్యక్తం చేశారు.అంతేకాదు సీఎం జగన్ కు కమలహాసన్ ధన్యవాదాలు తెలియజేశారు.

కమల్ హాసన్ ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా జగన్ పంపిన లేఖపై స్పందించారు.అందులో ఆంధ్ర ప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి జగన్ గారికి ధన్యవాదాలు.

Advertisement

అన్నయ్య ఎస్పీ బాలసుబ్రమణ్యం గారికి గౌరవార్థం కేంద్రానికి మీరు చేసిన విజ్ఞప్తికి తాను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అని తెలియజేశారు.కేవలం తమిళనాడు రాష్ట్రం నుంచి మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న అనేక చిత్రపరిశ్రమ అభిమానుల నుండి ఇదే సెంటిమెంట్ గా ఉందని ఆయన తెలియజేశారు.

ఎన్నో సంవత్సరాల నుండి బాలసుబ్రహ్మణ్యం కమల్ హాసన్ మధ్య ఉన్న ప్రేమానురాగాలతో వారిద్దరు అన్నయ్య, తమ్ముడు అని పిలుచుకునేవారు.వారిద్దరూ ఒకే తల్లికి పుట్టకపోయినా అంతకన్నా ఎక్కువగా వారిద్దరి మధ్య సాన్నిహిత్యం ఉంది.

బాలసుబ్రమణ్యం మృతి చెందిన తర్వాత అత్యంత బాధపడిన వ్యక్తుల్లో కమల్ హాసన్ కూడా ముందు వరుసలో ఉంటారు.దీనికి కారణం వాళ్ళిద్దరు ఎన్నో ఏళ్లుగా కలిసి పని చేస్తున్నారు.

కమల్ హాసన్ ప్రతి సినిమాకు బాలసుబ్రమణ్యం డబ్బింగ్ చెప్పేవారు.దశావతారం సినిమాలో కమల్ హాసన్ నటించిన పది అవతారాల కూడా బాలసుబ్రమణ్యం ఒక్కడే వాయిస్ ఇచ్చారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

ప్రస్తుతం సీఎం జగన్ కేంద్ర ప్రభుత్వానికి పంపిన లేఖను ఆయన గుర్తు చేస్తూ భారతరత్న కోసం బాలసుబ్రమణ్యం పేరును తాను స్వాగతిస్తున్నట్లు, అలాగే చాలా సంతోషం అని తెలియజేశారు.ఏది ఏమైనా బాలసుబ్రహ్మణ్యం మరణం చిత్రసీమకు చాలా పెద్ద దెబ్బే.

Advertisement

బాలసుబ్రమణ్యం 14 వివిధ భాషలలో 40 వేలకు పైగా పాటలు పాడి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరును సంపాదించుకున్నారు.

తాజా వార్తలు