తమిళనాడు రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారాయి.సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని తన అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు.
రజనీ కూడా రాజకీయ అరంగేట్రం చేసేందుకు సరైనా సమయం కోసం ఎదురుచూస్తు వచ్చారు.
అభిమానులతో పలుదఫాలుగా సంప్రదింపులు జరిపిన తరువాత ఎట్టకేలకు రాజకీయ అరంగేట్రం చేయబోతున్నట్లు రజనీ గత ఏడాది చివరలో ప్రకటించిన విషయం తెలిసిందే.
అంతేకాకుండా డిసెంబర్ చివరలో పార్టీ పేరు ప్రకటించి ఈ ఏడాది జనవరి నుంచి పార్టీ కార్యక్రమాలు చురుకుగా సాగుతాయని కూడా రజనీ చెప్పారు.కొత్త ఏడాదికి ముందే తన అభిమానులకు రజనీ గిఫ్ట్ ఇచ్చినట్లు అంతా అనుకున్నారు.

కానీ ఆయన పార్టీ పేరు ప్రకటించే ముందు రజనీకాంత్ అనారోగ్యం బారిన పడడం, రాజకీయాల్లోకి రావడంలేదని ప్రకటించడం అభిమానులకు నిరాశపరిచింది.దీంతో అభిమానులకు క్షమాపణలు కోరుతూ రజనీ లేఖ కూడా రాశారు.ఇదంతా జరిగిన విషయమే.కానీ ఎప్పుడైతే రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడంలేదని ప్రకటించారో అప్పటి నుంచి రజనీ మద్దతు కోసం రాజకీయ పార్టీలు క్యూ కడుతున్నాయట.
ఇప్పటికే రజనీ స్నేహితుడైన కమల్ హాసన్ తనకు మద్దతు ఇవ్వాలని రజనీని కోరుతానని ప్రకటించేశారు కూడా.అలాగే బీజేపీ నేతలు కూడా రజనీ మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
తమిళనాట రాజకీయాలు ఈసారి చాలా రసవత్తరంగా మారనున్నాయి.ఈనేపథ్యంలో రజనీ కాంత్ మద్దతు చాలా కీలకంగా మారనుంది.
ఈ క్రమంలోనే రజనీ మద్దతు కోసం పలు రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.
మరీ రజనీ తన స్నేహితుడైన కమలహాసన్‌కు మద్దతిస్తారా? లేక బీజేపీకు మద్దతిస్తారా? వేరే పార్టీకి మద్దతీఇస్తారా అనేది తెలియాలంటే మరి కొంత సమయం వేచి చూడక తప్పదు.