నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ( Kalyan Ram ) ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి దశాబ్దాలు గడుస్తున్న స్టార్ హీరో కాలేక పోయాడు.కానీ ఈ మధ్య ఇతడికి ఒక బ్లాక్ బస్టర్ హిట్ పడడంతో కెరీర్ మారిపోయింది.
కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.పీరియాడిక్ ఫిక్షనల్ డ్రామా ‘బింబిసార‘ సినిమాతో కళ్యాణ్ రామ్ ఎట్టకేలకు సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇక ఈ సినిమావరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.కళ్యాణ్ రామ్ బింబిసార నుండి ప్రయోగాత్మక సినిమాలను చేస్తూ వస్తున్నాడు.
ఇటీవలే అమిగోస్ సినిమా( Amigos )తో వచ్చి పర్వాలేదు అనిపించుకున్నాడు.ఇక ఇప్పుడు ‘డెవిల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు.
టీజర్ తో సాలిడ్ బజ్ ను అందుకున్న ఈ సినిమా నుండి నిన్న ట్రైలర్ రావడంతో మరింత క్యూరియాసిటీ పెంచేశారు.ఈ ట్రైలర్ తర్వాత నందమూరి ఫ్యాన్స్ మరింత ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.కాగా ఈ సినిమా కోసం అన్న కళ్యాణ్ రామ్ కోసం తమ్ముడు ఎన్టీఆర్ మరోసారి రాబోతున్నాడు అనే టాక్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారిందిఅతి త్వరలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా చేయనుండగా దీనికి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ రాబోతున్నట్టు తాజాగా బజ్ వైరల్ అయ్యింది.కళ్యాణ్ రామ్ గత రెండు సినిమాలకు ఎన్టీఆర్ హాజరయ్యాడు.
ఇప్పుడు ఈ సినిమాకు కూడా హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.చూడాలి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో.
కాగా డెవిల్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సంయుక్త మీనన్ ( Samyukta Menon ) నటిస్తుండగా నవీన్ మేడారం డైరెక్ట్ చేస్తున్నాడు.హర్ష వర్ధన్ రామేశ్వర్ ( Harshavardhan Rameshwar ) సంగీతం అందిస్తున్న ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించారు.నవంబర్ 24న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.