మెగా అల్లుడిగా విజేత చిత్రంతో టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ దేవ్, తన తొలి చిత్రంతో అదిరిపోయే హిట్ కొట్టాలని చాలా ఆశించాడు.కానీ కథలో దమ్ము లేకపోవడంతో ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బిచానా ఎత్తేసింది.
కానీ హీరోగా కళ్యాణ్ దేవ్ మంచి మార్కులను సంపాదించుకోవడంలో సక్సె్స్ అయ్యాడు.ఈ క్రమంలో తన రెండో చిత్రానికి చాలా సమయం తీసుకుని, ఎట్టకేలకు దాన్ని పూర్తి కూడా చేశాడు.
డైరెక్టర్ పులి వాసు తెరకెక్కిస్తున్న పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ‘సూపర్ మచ్చి’లో కళ్యాణ్ దేవ్ హీరోగా నటిస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్నప్పుడు కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.
అయితే ఇటీవల ఈ చిత్ర షూటింగ్ తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే.కాగా తాజాగా ఈ సినిమా అన్ని పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.
ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ కాపీ కూడా రెడీగా ఉందని వారు తెలిపారు.ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు భారీ ఆఫర్లు వచ్చినా, చిత్ర యూనిట్ మాత్రం థియేటర్లలోనే రిలీజ్ చేసేందుకు మక్కువ చూపారు.
అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.ఒకవేళ సంక్రాంతి బరిలో దించడం వీలు కాకపోతే, సరైన సమయం చూసి ఈ సినిమాను నేరుగా థియేటర్లలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
ఇక ఈ సినిమాలో కళ్యాణ్ దేవ్ సరసన రచితా రామ్ హీరోయిన్‌గా నటిస్తోండగా రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తోంది.మరి ఈ సినిమాతోనైనా మెగా అల్లుడు హిట్ అందుకుంటాడో లేడో చూడాలి.