యూకేలో భారత సంతతి కుటుంబంపై కత్తితో దాడి: పదేళ్ల చిన్నారి మృతి

యూకేలో భారత సంతతి కుటుంబంపై జరిగిన దాడిలో ఓ పదేళ్ల బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు.గత శనివారం సాయంత్రం 5.

20 గంటలకు లీసెర్టర్‌లోని వీధిలో ఓ తల్లీ తన ఇద్దరు బిడ్డలతో కలిసి నడుచుకుంటూ వెళ్తోంది.ఈ నేపథ్యంలో ఓ గుర్తు తెలియని దుండగుడు వీరిని అడ్డగించి కత్తితో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు.

పదేళ్ల చిన్నారికి మెడపై తీవ్రగాయాలై అక్కడే కుప్పకూలిపోయాడు.బాలుడి అన్నయ్య దుండగుడి దాడిలో గాయపడినప్పటికీ అతనిని అడ్డుకోవడానికి ప్రయత్నించాడు.

ఆ సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో భారత్‌లో ఉన్న అతని తండ్రి కల్పేష్ మిస్త్రీకి వీడియో కాల్ చేశాడు.దీంతో ఆయన అప్పటికప్పుడు యూకే బయలుదేరాడు.

Kalpesh Brother Explains About His Sister
Advertisement
Kalpesh Brother Explains About His Sister-యూకేలో భారత స�

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని తీవ్రగాయాలపాలైన వారిని ఆసుపత్రికి తరలించారు.అప్పటికే పదేళ్ల చిన్నారి మరణించగా.మరో బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు.

సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు సోమవారం ఈస్ట్‌ మిడ్‌లాండ్ రీజియన్‌లో అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘటనపై బాలుడి తండ్రి మాట్లాడుతూ.

వీడియో కాల్‌లో తన భార్య.బిడ్డ మెడకు చేతిని అడ్డుపెట్టి రక్తస్రావాన్ని ఆపుతుందని ఆ సమయంలో వారికి సాయం చేయలేకపోయినందుకు తనపై తనకే కోపం వచ్చిందని కల్పేష్ ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇండియన్ దుస్తుల్లో అమెరికా ఉపాధ్యక్షుడి పిల్లలు. అనార్కలీ, కుర్తాలో అదరగొట్టారు...
Advertisement

తాజా వార్తలు