కల్కి సినిమాలో అమితాబ్ పాత్ర తల దాచుకున్న గుడి ఇదే.. ఈ గుడి ఎక్కడ ఉందంటే?

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఎక్కడ చూసినా కూడా ఎక్కువగా వినిపిస్తున్న పేరు కల్కి.

నాగ్ అశ్విన్ ( Nag Ashwin )దర్శకత్వం వహించిన ఈ సినిమా తాజాగా విడుదలైన విషయం తెలిసిందే.

ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించింది.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా కోట్లల్లో కలెక్షన్స్ ను రాబడుతూ దూకుపోతుంది.

ఈ సినిమా విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ రావడంతో ప్రేక్షకులు కూడా క్యూ కడుతున్నారు.

సినిమా విడుదల అయి నాలుగు రోజులు అవుతున్నా కూడా థియేటర్లో బయట హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.దాంతో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇండియా వైడ్‌గా ఇప్పుడు కల్కి ఫీవర్ కనిపిస్తుంది.రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నారు.

Advertisement

బాహుబలి టాలీవుడ్ రేంజ్ ను పెంచేసిన ప్రభాస్ ఇప్పుడు మరోసారి కల్కి సినిమాతో తెలుగు సినిమాను మరో మెట్టు పైకెక్కించాడు.ఇకపోతే ఈ సినిమాలో చాలా మంది స్టార్ నటులు నటించిన విషయం తెలిసిందే.

బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో అశ్వత్థామ పాత్రలో నటించి మెప్పించారు.

అలాగే కమల్ హాసన్( Kamal Haasan ) ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు.దీపికా పదుకొనె ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించింది.ఇక ఈ మూవీ తొలి రోజే రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సాధించింది.తొలి రోజు ఈ సినిమా రూ.191 కోట్లు రాబట్టింది.ఇదిలా ఉంటే ఈ సినిమాలో మహాభారత నేపథ్యంలో చూపించారు.

ఇక ఈ సినిమాలో అమితాబ్ తన నటనతో ఆకట్టుకున్నాడు.కాగా సినిమాలో అశ్వత్థామగా నటించిన అమితాబ్‌ బచ్చన్‌ ఓకే గుడిలో తలదాచుకుంటాడు.

ఉద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ 
మహాభారతం తెరకెక్కించడానికి ఆ డైరెక్టర్ పర్ఫెక్ట్ ఛాయిస్.. నాగ్ అశ్విన్ కామెంట్స్ వైరల్!

అయితే ఆ గుడి మనలో చాలామందికి తెలిసిందే.కల్కి అవతారం పుట్టే సమయం వచ్చిన తర్వాత అశ్వత్థామ ఆ గుడి నుంచి బయటకు వస్తాడు.

Advertisement

అయితే ఈ గుడి నిజంగానే ఉంది.అయితే ఈ గుడి నెల్లూరు జిల్లాలో ఉంది.

నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పెరుమాళ్లపాడు లోని నాగేశ్వరస్వామి ఆలయమే ఈ సినిమాలో చూపించిన ఆలయం.కాకపోతే ఈ గుడిని కాశీలో ఉన్నట్టు చూపించారు.పెన్నానది తీరంలో ఈ గుడి బయట పడింది.2020లో ఇసక తవ్వకాల్లో ఈ గుడి బయటపడింది.ఈ గుడిని పరశురాముడు నిర్మించారని ఇతిహాసాలు చెప్తున్నాయి.

కాగా గతంలో వచ్చిన వరదల్లో ఈ గుడి ఇసుకలో మునిగిపోయింది.ఇక ఈ గుడి గురించి సినిమాలో చూపించిన తర్వాత ఎక్కువ పాపులర్ అవుతోంది.

తాజా వార్తలు