జనసేన ఆవిర్భావ సభలో పవన్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే.ఆయన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు స్పందిస్తూ కౌంటర్ల వర్షం కురిపిస్తున్నారు.
ఇప్పటికే పలుమార్లు పవన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డ ద్వారం పూడి.ఈసారి ఏకంగా శపథం చేశారు.
వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఎక్కడ పోటీ చేసినా ఓడిస్తామని ఎమ్మెల్యే చెప్పు కొచ్చారు.
ఆయన పోటీ చేసే నియోజక వర్గంలో తాను ఇంచార్జి పోస్ట్ తీసుకుంటానని కూడా ద్వారం పూడి అన్నారు.
అక్కడ పార్టీ కోసం పనిచేసి పవన్ కల్యాణ్‌ను ఓడిస్తానని ద్వారం పూడి శపథం చేశారు. పవన్‌కల్యాణ్ వాస్తవాలు తెలుసు కుని మాట్లాడాలని ఎమ్మెల్యే హితవు పలికారు.
జనసేన కార్యకర్తలకు పవన్.అన్యాయం చేస్తున్నారని ఆయన చెప్పు కొచ్చారు.
ఇప్పటికే ద్వారం పూడి చేసిన ప్రతి కామెంట్‌కు స్పందించి కౌంటర్ ఎటాక్ చేసిన జనసేన తాజా వ్యాఖ్యలపై ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి.