Kajol: సరికొత్త లుక్ లో కాజోల్.. దారుణంగా ట్రోల్స్ చేస్తున్న నెటిజన్స్?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్( Kajol ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.కాజోల్ బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా ఈమె సుపరిచితమే.

ఇండస్ట్రీలో దాదాపుగా మూడు దశాబ్దాలు తన అందం అభినయంతో, నటనతో ప్రేక్షకులను అలరించింది.కాజోల్ అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఆమె అందానికి ఎవరైనా దాసోహం కావాల్సిందే.ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కాజోల్ సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం మనందరికీ తెలిసిందే.

సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ తరచూ ఏదోక విషయంతో సోషల్ మీడియాలో నిలుస్తూనే ఉంటుంది.

Advertisement

ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో ఎక్కువగా ట్రోలింగ్స్ ని ఎదుర్కొంటోంది కాజోల్.కాజోల్ బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గణ్ ని( Ajay devgan ) పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా కాజోల్ ముంబై లో తన భర్త అజయ్ దేవ్‌గణ్ నటించిన భోలా చిత్రం( Bhola movie ) ప్రీమియర్ షో కి హాజరయ్యింది.

ఇక ఆ ప్రీమియర్ షో చూడడానికి వచ్చిన కాజోల్ తెల్లటి కోటుతో పాటు డిఫరెంట్ లుక్ లు కనిపించింది.కాజల్ తో పాటు కొడుకు, తల్లి,భర్త కూడా ఉన్నారు.

అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ వీడియోలో కాజోల్ ని చూసిన నెటిజన్స్ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు.

ఆమె డ్రెస్సింగ్ స్టైల్ పై నెగిటివ్గా కామెంట్స్ చేస్తున్నారు.అంతేకాకుండా చాలామంది ఆమె లుక్ నడకపై ట్రోల్స్ చేస్తున్నారు.కొందరు కాజోల్ అభిమానులు అందంగా ఉన్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?

ఆ డ్రెస్ లో కాజోల్ కడుపు కొంచెం ముందుకు కనిపించడంతో కాజోల్ గర్భవతి నా అంటూ కామెంట్ చేస్తున్నారు.కాగా కాజోల్ పెళ్లి తర్వాత కూడా సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

గత ఏడాది అది సలాం వెంకీ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది.

తాజా వార్తలు