రోహిత్ శర్మ అంటే నాకు ఆ రకమైన ఫీలింగ్ అంటున్న సౌత్ బ్యూటీ

టీం ఇండియా క్రికెటర్ రోహిత్ శర్మ బాటింగ్ కి ఫిదా కాని ఇండియన్స్ ఉండరంటే అతిశయోక్తి కాదు.

అతని బ్యాటింగ్ స్టైల్ కి చాలా మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఇక అమ్మాయిలకి రోహిత్ శర్మ అంటే ఓ విధమైన క్రష్ కూడా.అయితే రోహిత్ శర్మ బాలీవుడ్ సెలబ్రిటీలతో డేటింగ్ చేసాడనే గాసిప్స్ కూడా అతని పెళ్ళికి ముందు గట్టిగా వినిపించాయి.

అయితే వాటికి ఫుల్ స్టాప్ పెట్టి తన చిన్ననాటి ఫ్రెండ్ ని ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు.ఇదిలా ఉంటే ఈ రోజు రోహిత్ శర్మ పుట్టినరోజు సందర్భంగా అతని గురించి అతనికి క్రికెటర్స్ నుంచి సెలబ్రిటీలు వరకు అందరూ విషెస్ చెప్పారు.

ఇదిలా ఉంటే సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తాజాగా రోహిత్ శర్మ గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది.ఇప్పుడు అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Advertisement

భారత టీం ఓపెనర్ రోహిత్ శర్మ అంటే తనకి చాలా ఇష్టమని, ఒకప్పుడు అతనిపై క్రష్ ఉండేదని న‌టి కాజల్ అగ‌ర్వాల్ తెలిపింది.క్రికెట్‌లో అతని స్కిల్స్ తనని చాలా ఆకట్టుకున్నాయని చెప్రింది.

ఈ రోజు తన 32వ బర్త్‌డే జరుపుకుంటున్న రోహిత్ గురించి కాజల్ ఇలాంటి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో నెటిజన్స్ ఆసక్తికరంగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు