ఆర్జీవిని టెన్షన్ పెట్టిన ఎలక్షన్ కమిషన్

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాని ఏపీలో రిలీజ్ చేయడానికి ఆర్జీవి సన్నాహాలు చేసుకున్నాడు.ఇక సినిమా రిలీజ్ చేయడానికి ముందు విజయవాడలో ప్రెస్ మీట్ అంటూ హడావిడి చేసి, పోలీసులు అరెస్ట్ చేసేంత వరకు వ ఇషయాన్ని వివాదం చేసి సినిమాపై మరోసారి హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేసాడు.

 Election Commission Open Letter To Lakshmis Ntr Movie Team-TeluguStop.com

అయితే ఆర్జీవి అనుకున్నట్లు అంతా సాగితే మే 1న సినిమా ఏపీలో హ్యాపీగా రిలీజ్ అయ్యేది అయితే ఏపీ ఎన్నికల కమిషనర్ ద్వివేది మరోసారి లక్ష్మీస్ ఎన్టీఆర్ కి షాక్ ఇచ్చారు.

డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలక్రిష్ణ ద్వివేది లేఖ రాశారు.

మూవీ విడుదల విషయంలో వర్మ చేసిన అభ్యర్థనపై ఆయన తన స్పందనను తెలియజేశారు.గతంలో కేంద్ర ఎన్నికల సంఘం జారీచేసిన ఆదేశాలకు కట్టుబడి ఉండాలని లేఖలో పేర్కొన్నారు ద్వివేది.

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో రాజకీయ నేతల బయోపిక్‌లపై నిషేధం విధిస్తూ ఏప్రిల్ 10న ఈసీ ఆదేశించిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో ఏపీలో మే 23న ఫలితాలు విడుదలయ్యే వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని, అప్పటి వరకు బయోపిక్‌లపై నిషేధం కొనసాగుతుందని ద్వివేది స్పష్టం చేసారు.

దీంతో మరోసారి లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీకి బ్రేక్స్ పడినట్లు అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube