కేవలం రూ.10 ఫీజుతో వైద్యం చేస్తున్న డాక్టరమ్మ.. ఈ కడప డాక్టర్ మంచి మనస్సుకు ఫిదా అవ్వాల్సిందే!

ప్రస్తుత కాలంలో 10 రూపాయలకు పెద్దగా విలువ లేదనే సంగతి తెలిసిందే.

ఏదైనా ఆస్పత్రిలో వైద్యం చేయించుకోవాలంటే ఓపీ రూపంలో 150 నుంచి 600 రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులలో ఈ మొత్తం మరింత ఎక్కువగా ఉంటుంది.అయితే ఈ కాలంలో కేవలం 10 రూపాయల ఫీజుతో( 10 Rupees Doctor ) వైద్యం చేసేవాళ్లు చాలా అరుదుగా ఉంటారు.

అలాంటి అరుదైన డాక్టర్లలో కడప జిల్లాకు చెందిన యువ వైద్యురాలు నూరీ పర్వీన్( Dr.Noori Parveen ) కూడా ఒకరు.కడపలో( Kadapa ) మెడిసిన్ చదివిన నూరి పర్వీన్ స్వస్థలం విజయవాడ అయినా కడపలోనే వైద్య సేవలు అందిస్తుండటం గమనార్హం.

డాక్టర్ గా( Doctor ) తక్కువ ధరకే వైద్య సేవలు అందిస్తూ నూరి పర్వీన్ ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు.భవిష్యత్తులో పెద్ద ఆస్పత్రిని నిర్మించి ఆ ఆస్పత్రి ద్వారా కూడా 10 రూపాయలకే వైద్య సేవలను అందిస్తుండటం గమనార్హం.

Advertisement
Kadapa 10 Rupees Doctor Noori Parveen Success Story Details, Kadapa, 10 Rupees D

ఒకవైపు వైద్య సేవలు అందిస్తూనే మరోవైపు సేవా కార్యక్రమాలలో ఆమె పాల్గొంటున్నారు.

Kadapa 10 Rupees Doctor Noori Parveen Success Story Details, Kadapa, 10 Rupees D

ప్రస్తుత కాలంలో వైద్యం ఖరీదైనది కావడంతో నూరి పర్వీన్ తక్కువ ధరకే వైద్యం చేయడం ద్వారా తన వంతు సహాయసహకారాలు అందిస్తున్నారు.లక్షల రూపాయల ఫీజులు చెల్లించలేక ఎంతోమంది ఇబ్బందులు పడుతుండటంతో వాళ్లకు అండగ నిలుస్తున్నానని నూరి పర్వీన్ కామెంట్లు చేశారు.గతంలో కొంతమంది ఒక్క రూపాయికే వైద్య సేవలు అందించారని ఆమె చెబుతున్నారు.

Kadapa 10 Rupees Doctor Noori Parveen Success Story Details, Kadapa, 10 Rupees D

10 రూపాయల ఫీజు అంటే ఎవరూ భారంగా ఫీల్ కారని నూరి పర్వీన్ పేర్కొన్నారు.నూర్‌ ఛారిటబుల్‌ ట్రస్టు( Noor Charitable Trust ) దారా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నానని ఆమె పేర్కొన్నారు.ప్రజలకు సేవ చేయడం ద్వారా చరిత్రలో నిలిచిపోవాలని తన కోరిక అని నూరి పర్వీన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

నూరి పర్వీన్ సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుందని చెప్పవచ్చు.నూరి పర్వీన్ మరెంతో మందికి వైద్య సేవలు అందించాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

న్యూస్ రౌండప్ టాప్ 20 
Advertisement
" autoplay>

తాజా వార్తలు