Pavala Syamala : దీనస్థితిలో ప్రముఖ టాలీవుడ్ నటి పావలా శ్యామల.. ఆ నటుడు ఆర్థిక సహాయం చేయడంతో?

టాలీవుడ్ ప్రముఖ లేడీ కమెడియన్ పావలా శ్యామల( Pavala Syamala ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ఒకప్పుడు దాదాపుగా 300 కి పైగా సినిమాలలో నటించి లేడి స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకుంది పావలా శ్యామల.

స్టార్ హీరోల సినిమాల్లో నటించి అలరించింది.అయితే సినిమాలలో నటించినన్ని రోజులు సెలెబ్రిటీగా ఒక వెలుగు వెలిగింది పావలా శ్యామలా.

ఒకప్పుడు అలా మంచి జీవితాన్ని గడిపిన ఆమె ప్రస్తుతం తినడానికి తిండి లేక ఆకలితో అలమటిస్తోంది.ఇంకా చెప్పాలంటే ఆమె పరిస్థితి ప్రస్తుతం చాలా దారుణంగా ఉందని చెప్పవచ్చు.

ఇప్పుడు తినడానికి తిండి కూడా లేక, అనారోగ్య సమస్యలతో( Tollywood )లో పలువురు ప్రముఖులు ఆమెకు సహాయం చేసిన విషయం తెలిసిందే.అయినప్పటికీ ఆ డబ్బులు ఆమెకు సరిపోక ఆమె ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది.

Advertisement

ఇది ఇలా ఉంటే తాజాగా పావలా శ్యామలకు తెలుగు సినీ నటుడు ఆర్థిక సహాయాన్ని( Financial assistance ) అందించి తన గొప్ప మనసును చాటుకున్నారు.ఆ నటుడు మరెవరో కాదు కాదంబరి కిరణ్.అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న‌ న‌టి పావ‌లా శ్యామ‌ల‌కు ఆర్థిక స‌హాయం అందించి మాన‌వ‌త్వం చాటుకున్నాడు.

ఆమె ప్రస్తుత పరిస్థితి గురించి తెలుసుకున్న కాదంబ‌రి కిర‌ణ్ ఆమెకు రూ.25,000 చెక్కును అందించారు.పావ‌ల శ్యామ‌లకు మెరుగైన వైద్యం, క‌నీస అవ‌స‌రాల‌ను తీర్చేలా సాయం చేశారు.

మీడియా ద్వారా విషయం తెలుసుకున్న కాదంబరి కిరణ్( Kadambari kiran ) హైదరాబాద్ శివారులోని ఒక వృద్ధాశ్రమంలో ఉంటున్న నటి శ్యామల ను తనంతట తానే వెతుకుంటూ వెళ్లి స్వయంగా సహాయం చేసి పెద్దమనసు చాటుకున్నారు .ఆయ‌న మాన‌వ‌త్వానికి ప‌లువురు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.సినీ పరిశ్రమలో పేద కార్మికులకు, అవసరాల్లో ఉన్న పేదలకు సహాయం చేయడానికిమనం సైతం అనే ఫౌండేషన్ స్థాపించి దశాబ్దం పైగా నిర్విరామంగా సేవలు కొనసాగించడం విశేషం.

అల్లు అర్జున్ అరెస్టు పెద్ద కుట్ర ఉంది.. సింగర్ కల్పన షాకింగ్ కామెంట్స్?
Advertisement

తాజా వార్తలు