అక్కినేని షూటింగ్ లో కె విశ్వనాధ్ కి జరిగిన భారీ ప్రమాదం

కళాతపస్వి కె.విశ్వనాథ్.

తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శక దిగ్గజం.

ఈయన చేతుల మీదుగా ఎన్నో అద్భుత సినిమాలు రూపుదిద్దుకున్నాయి.

చక్కటి కథ, అంతకు మించిన సంగీతంతో ఎన్నో క్లాసిక్ చిత్రాలను తెరకెక్కించాడు ఈ దర్శకుడు.ఇతడితో సినిమాలు చేయడం తమకు దక్కిన గౌరవంగా భావించేవారు హీరో, హీరోయిన్లు.

అలాంటి దిగ్గజ దర్శకుడికి ఓ సారి సెట్ లో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు.ఇంతకీ ఏ సినిమా షూటింగ్ లో ఈ ఘటన జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

అక్కినేని నాగేశ్వర రావు, సావిత్రి, జమున కీలక పాత్రల్లో నటించిన క్లాసిక్ మూవీ మూగ మనసులు.ఆదుర్తి సుబ్బారావు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

కే.విశ్వనాధ్ ఈ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు.మూగ మనసులు మూవీ షూటింగ్ ఎక్కువ భాగం ఔట్ డోర్‌ లో కొనసాగింది.

కొన్ని కీలక సన్నివేశాలు మాత్రమే హైదరాబాద్ లోని సారథి స్టూడియోలో షూట్ చేశారు.మూగ మనుషులకు సంబంధించిన క్లైమాక్స్ సీన్స్ సారథి స్టూడియోలో చిత్రీకరిస్తున్నారు.నటీమణి జమున మేకప్ రూంలో మేకప్ చేసుకుంటున్నారు.

ఆమెకు ఓల్డ్ గెటప్ వేస్తున్నారు.దీంత ఆమెకు సూట్ అయ్యిందో తేదో అని చూసేందుకు విశ్వనాథత్ వెళ్లారు.

ఘనంగా పీవీ సింధు వివాహ రిసెప్షన్... సందడి చేసిన సినీ తారలు!
అలసిపోకుండా స్త్రీల కోరిక తీర్చే సెక్స్ రోబోట్ ... మగవారి కంటే నయం అంట

చూసి.బాగానే ఉంది అనుకుని తిరిగి వెనక్కి వచ్చాడు.

Advertisement

సెట్ లో అడుగు పెట్టగానే కట్టర్ జారి ఆయన తల మీద పడింది.దెబ్బ గట్టిగా తగలడంతో రక్తం జలజలా కారింది.

వెంటనే సినిమా హీరో అక్కినేనితో పాటు హీరోయిన్లు, సిబ్బంది అంతా అక్కడ గుమిగూడారు.రక్తం అధికంగా రావడం పట్ల ఏఎన్నార్ చలించిపోయారు.

వెంటనే ఆ గాయాన్ని శుభ్రం చేసి.రక్తం రాకుండా ఆపారు.

వెంటనే ఉస్మానియా హాస్పిటల్ కు తీసుకెళ్లి తలకు కుట్లు వేయించుకుని తీసుకొచ్చారు.అనంతరం షూటింగ్ యథావిధిగా కొనసాగింది.

రెండు రోజుల పాటు ఆయన రెస్టు తీసుకుని మళ్లీ తను యథావిధిగా షూటింగ్ లో పాల్గొన్నారు.

తాజా వార్తలు