సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటి జ్యోతిక( Jyothika ) ఒకరు.ఈమె పలు తెలుగు తమిళ భాషా చిత్రాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా సక్సెస్ అయ్యారు.
ఇక సూర్యతో( Suriya ) పెళ్లి తరువాత ఇండస్ట్రీకి దూరంగా ఉన్న జ్యోతిక ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.సెకండ్ ఇన్నింగ్స్( Second Innings ) లో భాగంగా ఈమె తమిళ చిత్రాలతో పాటు హిందీ సినిమాలలో కూడా నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నటువంటి ఈమె ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తన సహ నటులపై తన అభిప్రాయాలను తెలియజేస్తూ పలు విషయాలను వెల్లడించారు.
తమిళ చిత్ర పరిశ్రమలో ఏ హీరోలతో నటించాలి అనుకుంటున్నారనే ప్రశ్న ఈమెకు ఎదురయింది.ఈ ప్రశ్నకు జ్యోతిక సమాధానం చెబుతూ.చాలా రోజుల నుంచి నా సినిమాలలో నేనే మెయిన్ లీడ్ చేస్తున్నాను.
అందుకే వేరే హీరో కావాలని నేను అనుకోవడం లేదని తెలిపారు.ఒకవేళ ఏదైనా మంచి కథ కనుక దొరికితే సూర్యతో కలిసి ఓ హిందీ సినిమా( Hindi Movie ) చేయాలని ఉంది అంటూ ఈ సందర్భంగా జ్యోతిక తెలిపారు.
ఇక ఇప్పటివరకు ఈమె కలిసిన నటించిన హీరోల గురించి మాట్లాడుతూ.సినిమా మంచిగా రావడం కోసం నటుడు మమ్ముట్టి గారు( Mammootty ) ఎంత కష్టమైనా భరిస్తారని తెలిపారు.అలాగే రజినీకాంత్( Rajinikanth ) గురించి మాట్లాడుతూ ఆయన సూపర్ స్టార్ డం ఉన్న హీరో అని తెలిపారు.విజయ్ స్థిరత్వం కల హీరో అంటూ అందరి హీరోలపై ప్రశంసలు కురిపించారు.
ఇక సూర్య గురించి మాట్లాడుతూ సూర్యలో నాకు బాగా నచ్చే విషయం ఏంటంటే ఆయన అందరిని గౌరవిస్తారు, అందరి కోసం సమయాన్ని కేటాయిస్తారు.స్నేహానికి చాలా విలువ ఇస్తారు.
ఎవరైనా మాట్లాడితే చాలా ఓపికగా వింటారు.ఆయనకు సహనం ఎక్కువ.
ఈ విషయాల నాకు బాగా నచ్చుతాయని తెలిపారు.