మీడియేషన్ సెంటర్ ఏర్పాటుతో కోర్టులపై పని భారం తగ్గుతుందని మీడియేషన్ డే వేడుకలలో పాల్గొన్న మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ( Former Chief Justice NV Ramana ) పేర్కొన్నారు.హైదరాబాదులో అంతర్జాతీయ ఆర్పిట్రేషన్ అండ్ మీడియేషన్ ( International Arbitration and Mediation )నిర్వహించిన మీడియేషన్ డే కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు హైదరాబాదులో మీడియేషన్ సెంటర్ ఏర్పాటుకు గురించి నేను జస్టిస్ లావు నాగేశ్వరరావు( Justice Lau Nageswara Rao) చాలా సార్లు సంవత్సరాలకు చర్చించుకుంటున్నామని ఇంత కాలానికి అది ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని దీని వెనక జస్టిస్ లాగు నాగేశ్వరరావు కృషి చాలా ఉందని ఆయన కొనియాడారు….
మొదటి మీడియేషన్ డే( Mediation Day ) వేడుకలలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని ఆయన తెలిపారు.

న్యాయవ్యవస్థలో మద్యవర్తిత్వ కేంద్రాల అవసరం చాలా ఉందని , ఈ విదానం ద్వారా కోర్టులు పై పని భారం తగ్గుతుందని, కోర్టులు పనితీరు కూడా వేగం పుంజుకుంటుందని ….ఆయన తెలిపారు ….ఏళ్ల తరబడి కేసులు పెండింగ్ లో ఉండడం వల్ల చాలామందికి సత్వర న్యాయం అన్నది అందని ద్రాక్ష గా మారిందని ఈ మీడియేషన్ సెంటర్లు సమర్థవంతంగా పనిచేస్తే కోర్టు వరకు రావాల్సిన అవసరం తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు….
మధ్యవర్తిత్వం అన్నది కొత్త గా ఇప్పుడు వచ్చిన కాన్సెప్ట్ కాదని, ఇది పురాణాల నుంచి ఉన్నదని, ఆనాడు కౌరవులు పాండవులు మధ్య కృష్ణుడు మధ్యవర్తిత్వ వహించాడని అది విఫలమవడం వల్లే మహాభారత యుద్ధం జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

అయితే ఇరుపక్షాలకు న్యాయం జరిగే విధంగా మీడియేషన్ సెంటర్లు నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన అవసరం ఉంటుందని లేకపోతే ఈ సెంటర్ల ఏర్పాటు యొక్క మౌలిక ఉద్దేశం దెబ్బతింటుందని కూడా ఆయన ఈ సందర్భంగా సెలవిచ్చారు హైదరాబాదులో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ హేమ, జస్టిస్ రవీంద్ర తో పాటు మరి కొంతమంది న్యాయపవిధులు కూడా పాల్గొన్నారు.







