కోడి కత్తి వ్యవహారంలో ఎన్ఐఏ ఫైనల్ రిపోర్ట్ గాని, ఇప్పుడు వైఎస్ భాస్కర్ రెడ్డి( YS Bhaskar Reddy ) అరెస్టు వ్యవహారం గాని ఇలా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకమైన పరిణామాలు రోజుల వ్యవధిలో జరుగుతుండడంతో బిజెపి క్రమంగా జగన్కు దూరం అవడానికి రంగం సిద్ధం చేసుకుంటుందని అందుకే వరుస పెట్టి జగన్ వ్యతిరేక పరిణామాలు జరుగుతున్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి… చాలామంది నేతలకు ఎంతో కష్టపడితే గాని దొరకని మోడీ అమిత్షాల అపాయింట్మెంట్లు జగన్ కు మొన్నటి వరకూ చాలా ఈజీ గా దొరికేవీ.బిజెపి( BJP ) అధిష్టానాన్ని తాను ఎప్పుడు కలవాలనుకుంటే అప్పుడు కలిసే వెసులుబాటు జగన్ కి ఇప్పటివరకు ఉండేది… అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయని జగన్కు ఒకప్పుడు ఇచ్చేంత ప్రయారిటీ కేంద్రం ఇప్పుడు ఇవ్వడం లేదని తెలుగుదేశం అనుకూల మీడియాలో వార్తలు వస్తున్నాయి.

రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయపరిణామాలను కేంద్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తుందని ఎప్పటికప్పుడు నిఘావస్థల ద్వారా సర్వే రిపోర్ట్ లు తెలుసుకుంటుందని ఇటీవల రాజకీయంగా జరుగుతున్న కొన్ని పరిణామాలతో జగన్ గ్రాఫ్ ప్రజల్లో తగ్గుతూ వస్తుందని కేంద్రం భావిస్తున్నదని అంతేకాకుండా ఏపీ లో తమ భాగస్వామి జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ ఇటీవల ఢిల్లీ( Delhi ) పర్యటనలో కూడా జగన్ అనుకూల వైఖరితో ఉంటే తాను కూటమిలో కొనసాగనని భాజాపాకు తేల్చి చెప్పేసారని అందువల్ల కేసులు వ్యవహారంలో తాము న్యూట్రల్ గా ఉండాలని, చట్టం తన పని తను చేసుకోపోతుందన్న ఉద్దేశంలో కేంద్ర ప్రభుత్వం ఉందని అందుకే విచారణ సంస్థలు జగన్( Jagan ) కేసుల విషయం లో దూకుడుగా ముందుకు వెళ్తున్నాయి అని తెలుస్తుంది.విభజన హామీలు అమలు చేయకపోయినా, ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ,పోలవరం ప్రాజెక్టుకు సరైన నిధులు కేటాయించకపోయినా కూడా కేంద్రం తో సఖ్యత నెరుపుతూ వచ్చిన జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు కేంద్ర పెద్దలు హ్యాండ్ ఇచ్చారని,,వైసీపీ అధిష్టానం లో అంతర్మాదం మొదలైనట్టుగా విశ్లేషణ లు వస్తున్నాయి.రాజకీయాలలో అధికారమే అంతిమ లక్ష్యం కాబట్టి అధికారం వైపు ఎవరు ఉంటే వారికి అనుకూలంగా పరిణామాలు జరుగుతూ ఉంటాయి మరి ఒక్కొక్కటిగా జగన్ వ్యతిరేక పరిమాణ పరిణామాలు జరుగుతూ ఉండటం ఆ పార్టీని కలవరపరుస్తున్నట్లుగా తెలుస్తుంది.







