బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు.ఈ క్రమంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడం సంతోషంగా ఉందన్నారు.పంజరం నుంచి బయటకు వచ్చినట్లుందని తెలిపారు.
అయితే తనను పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేశారో కేసీఆర్ చెప్పాలని జూపల్లి డిమాండ్ చేశారు.ఈ క్రమంలో తన ప్రశ్నలకు సమాధానం చెప్పి సస్పెండ్ చేస్తే బాగుండేదని వెల్లడించారు.
గత మూడేళ్లుగా తనకు పార్టీ సభ్యత్వం పుస్తకాలు ఇవ్వలేదన్నారు.ఈ క్రమంలో తాను పార్టీ సభ్యునిగా ఉన్నాట్టా.
లేనట్టా అని ప్రశ్నించారు.ముఖ్యమంత్రి అంటే ప్రభుత్వ ఖజానాకు ధర్మకర్తని చెప్పారు.
పారదర్శకంగా పరిపాలన చేయడం సీఎం బాధ్యతన్న ఆయన వాళ్ల బండారం బయటపడుతుందని భయపడే తనను సస్పెండ్ చేశారని వెల్లడించారు.