మీ కపట అభిమానం ఎన్టీఆర్ అన్నకు అవసరం లేదు.. మాలో ఒకడివి కాదనే వాళ్లకు జవాబిదేనంటూ?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) చంద్రబాబు అరెస్ట్( Chandrababu Arrest ) గురించి స్పందించకపోవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ రెండుగా చీలిపోయారు.

కొంతమంది ఎన్టీఆర్ నిర్ణయాన్ని సమర్థిస్తుంటే మరి కొందరు ఎన్టీఆర్ నిర్ణయాన్ని విమర్శిస్తున్నారు.

మీ కపట అభిమానం ఎన్టీఆర్ అన్నకు అవసరం లేదు అంటూ తాజాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్( NTR Fans ) మరో వెర్షన్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతూ హాట్ టాపిక్ అవుతోంది.ఎన్టీఆర్ ఫ్యాన్స్ లేటెస్ట్ పోస్ట్ లో మాలో ఒకడివి కాదనే వాళ్లకు జవాబిదేనంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

"మీరు అభిమానించేది తారక్ అన్నని కాదు, ఆ నందమూరి వంశాన్ని, ఆ తెలుగుదేశం పార్టీని.( TDP ) అతన్ని ఒక మనిషిలా అభిమానించి ఉంటే అతని ప్రతి నిర్ణయాన్ని గౌరవిస్తారు.

తనని ప్రేమించే అభిమానులు ఆయనకు చాలు" అని యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పేర్కొన్నారు.

Advertisement

"జూనియర్ ఎన్టీఆర్ ఏం చేయాలి అనేది ఆయన వ్యక్తిగతం, ఆయన ఇష్టం.సినిమాల వరకు ఏం అడిగినా జూనియర్ ఎన్టీఆర్ యాక్టర్ గా చేస్తాడు.రియల్ లైఫ్ లో జూనియర్ ఎన్టీఆర్ అభిప్రాయాలు ఆయనకు ఉంటాయి.

అందులో తప్పులు వెతకడానికి, ఆంక్షలు విధించడానికి ఎవరికీ ఆస్కారం లేదు.జూనియర్ ఎన్టీఆర్ నిర్ణయాన్ని గౌరవించలేని వాళ్లు, ఎన్టీఆర్ ఇష్టాయిష్టాలకు విలువ ఇవ్వలేని వాళ్లు ఆయన అభిమానులు కారు" అని చెప్పుకొచ్చారు.

అలాంటి వాళ్ల కపట ఆనందం ఎన్టీఆర్ అన్నకు అవసరం లేదని ఫ్యాన్స్ వెల్లడించారు.మా హీరోకు.మా అన్నకు మేమున్నామంటూ ఫ్యాన్స్ తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుండటం గమనార్హం.జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ రాబోయే రోజుల్లో మరింత పెరగాలని అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?

జూనియర్ ఎన్టీఆర్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఊహించని స్థాయిలో పెరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు