అమెజాన్ ప్రైమ్ వినియోగదారులకు ఝలక్..!

ఓటీటీ ప్లాట్ ఫాంలలో ఎక్కువగా పాపులర్ అయిన వాటిలో అమెజాన్ ప్రైమ్ వీడియో కూడా ఒకటి.

అమెజాన్ ప్రైమ్ లో కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు మనం చూడొచ్చు.

థియేటర్లలో విడుదలకు నోచుకోని సినిమాలు డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అవుతూ ఉంటాయి.అందుకే ఈ ఓటీటీకి వినియోగదారులు ఎక్కువగానే ఉన్నారు.

అయితే ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో తన సబ్‌స్క్రిప్షన్‌ విధానాన్ని మార్చింది.గతంలో ఉన్న ప్లాన్ ల పద్ధతిని మార్చేసి తన వినియోగదారులకు షాకిచ్చింది.

అమెజాన్ ప్రైమ్ ఇండియన్ రిజర్వు బ్యాంకు మార్గదర్శకాలను అనుసరించి నెల వారీ ప్రైమ్ మెంబర్‌ షిప్‌ ను తొలగించింది.దీంతో ఇప్పుడు 3 నెలలు, ఏడాది ప్రీమియం మెంబర్‌ షిప్ మాత్రమే అందుబాటులో ఉంది.

Advertisement

రికరింగ్ ఆన్‌ లైన్ లావాదేవీల కోసం అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథెంటికేషన్ (ఏఎఫ్ఏ)ను అమలు చేయాలంటూ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఆదేశించింది.ఇందుకోసం ఈ ఏడాది సెప్టెంబరు 30 వరకు గడువును ఇచ్చింది.ఈ నేపథ్యంలో నెలకు రూ.129తో అందుబాటులో ఉన్న నెల వారీ ప్యాక్‌ ను అమెజాన్ తొలగించింది.అలాగే, ఫ్రీ ట్రయల్‌ ఆఫర్ ను కూడా తొలగించింది.ఇకపై ఎవరైనా వినియోగదారులు కొత్తగా అమెజాన్ ప్రైమ్ వీడియో మెంబర్‌ షిప్ తీసుకోవాలన్నా, లేదా పాత మెంబర్‌ షిప్ ను రెన్యువల్ చేసుకోవాలన్నా.3 నెలలు, లేదంటే వన్ ఇయర్ సబ్‌స్క్రిప్షన్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.అమెజాన్ మూడు నెలల ప్రైమ్ మెంబర్‌ షిప్ కావాలంటే రూ.329, ఏడాది సభ్యత్వం కోసం రూ.999 చెల్లించాల్సి ఉంటుంది.అమెజాన్ ప్రైమ్ భవిష్యత్‌లో ఈ ఫ్రీ ట్రయల్‌ ను, నెలవారీ సబ్ స్క్రిప్షన్ ను పునరుద్ధరిస్తుందా? పూర్తిగా నిలిపివేస్తుందా అన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.

వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..
Advertisement

తాజా వార్తలు