ఇటీవలే కాలంలో దారి దోపిడీలు, ఇంట్లో ఒకరు లేదా ఇద్దరు ఉన్న సమయంలోనే దొంగలు దోపిడీలకు పాల్పడుతున్న రోజులువి.అలాంటిది ఏదైనా ఇంటికి తాళం వేసి ఉన్నట్లు కనిపిస్తే చాలు క్షణాల్లో ఆ ఇంట్లో భారీ దోపిడీ కచ్చితంగా జరుగుతుంది అనడానికి ఈ సంఘటన నిదర్శనం.
అసలు ఏం జరిగిందో అనే వివరాలు చూద్దాం.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
ఆదిలాబాద్( Adilabad ) పట్టణంలోని నారాయణ ఎన్ క్లేవ్స్ లో( Narayana en Claves ) ఆదివారం రాత్రి భారీ దోపిడీ జరిగింది.దాదాపుగా రూ.23 లక్షల విలువైన బంగారు నగలు చోరీకి గురవడంతో స్థానికంగా ఉండే వారంతా భయాందోళనకు గురయ్యారు.నారాయణ ఎన్ క్లేవ్స్ కాలనీలో జి.కొమురయ్య అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు.ఆదివారం రాత్రి సుమారుగా 7:50 గంటల సమయంలో దుర్గామాత మండపంనికి వెళ్లి ఓ అరగంట తర్వాత ఇంటికి తిరిగి వచ్చారు.అంతలోపే ఇంటి తాళం పగలగొట్టి ఉండడం చూసి, కంగారుతో ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా.20 తులాల బంగారు, 35 తులాల వెండి, రూ.11 లక్షల నగదు కనిపించలేదు.

దీంతో కొమురయ్య( Komuraya ) కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మొత్తం ఇంటిని పరిశీలించి ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసుకుని అన్నీ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.అయితే ఈ దొంగతనం కాస్త ఆశ్చర్యకరంగానే ఉంది.
కేవలం అరగంట సమయంలోనే దొంగతనం చేయడం దుండగులకు ఎలా సాధ్యమైంది.కొమురయ్య కుటుంబ సభ్యులు బయటకు వెళ్తున్న సంగతి ఆ దుండగులకు ఎలా తెలుసు.
ఈ భారీ దోపిడీలో కొమురయ్యకు తెలిసినవారు ఎవరైనా ఉన్నారా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఈ వార్త స్థానికంగా ఉండే వారికి భయబ్రాంతులకు గురిచేసింది.







