మాస్ మహారాజ రవితేజ (Ravi Teja) నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”టైగర్ నాగేశ్వరరావు” (Tiger Nageswara Rao).నూతన డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో రవితేజ కూడా పాన్ ఇండియా స్టార్ గా మారడానికి సిద్ధం అవుతున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ తో పాటు టీజర్, సాంగ్స్, ట్రైలర్ కూడా రిలీజ్ చేసి అంచనాలు పెంచేశారు.
దీంతో ఈ సినిమా రిలీజ్ కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఇక రిలీజ్ డేట్ దగ్గరకు రావడంతో నిన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు మేకర్స్.ఈ ఈవెంట్ లో చిత్ర యూనిట్ మొత్తం సందడి చేసారు.
ఇదే వేదికపై రేణు దేశాయ్ మాట్లాడిన స్పీచ్ నెట్టింట వైరల్ అయ్యింది.రేణు దేశాయ్ ఈ సినిమాలో కీలక రోల్ పోషించిన విషయం తెలిసిందే.

ఈమె చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ సినిమాతో కమ్ బ్యాక్ ఇవ్వబోతుంది.‘హేమలత లవణం’( Hemalatha Lavanam ) అనే పాత్రలో ఈమె నటిస్తున్నట్టు కన్ఫర్మ్ చేస్తూ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయగా ఇది ఆకట్టుకుంటుంది.ఇదిలా ఉండగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రేణు దేశాయ్ (Renu Desai) మాట్లాడుతూ.నేను సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి 23 ఏళ్ళు అవుతుంది.
అయినా నాకు బద్రి సినిమా( Badri Movie ) ఈ మధ్యనే రిలీజ్ అయినట్టు అనిపిస్తుంది.

ఇంతకాలం నేను తెలుగు సినిమాలు చేయకపోయినా మీరంతా నాపై అదే ప్రేమను చూపించారు.ఈ సినిమాలో ఛాన్స్ ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్ చెబుతున్నాను.అలాగే రవితేజా గారి వంటి సీనియర్ స్టార్ తో కలిసి పని చేయడం ఆనందంగా ఉందని రవితేజ తీసుకున్న నిర్ణయం నాకు ఎంత ఇంపార్టెంట్ అనేది ఆయనకు తెలియదు అని అందుకే ఆయనకు పర్సనల్ గా కూడా థాంక్స్ చెబుతున్నా అంటూ ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మరి అక్టోబర్ 20న రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ఎలా అలరిస్తుందో చూడాలి.







