జ్యూస్ ప్యాకెట్‌లో జెర్రి.. హడలిపోయిన కస్టమర్

ప్రస్తుతం వేసవి కాలం కావడంతో ఎండలు మండిపోతున్నాయి.దేశవ్యాప్తంగా పలు చోట్ల 40 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

 Jerry In A Juice Packet A Distraught Customer , Jerry , Viral Latest, Juicer, L-TeluguStop.com

సాధారణం కంటే మరో నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ వెల్లడించింది.ఈ తరుణంలో బయటికి వచ్చిన వారికి గొంతు ఎండిపోతుంది.

ఇదే తరహాలో ఎండకు సొమ్మసిల్లిన ఓ యువకుడు చల్లని మ్యాంగో జ్యూస్( Mango juice ) తాగాలని భావించాడు.వెంటనే సమీపంలోని ఓ దుకాణంలో మాజా ప్యాకెట్ కొనుక్కున్నాడు.

అది ఓపెన్ చేద్దామని భావించేలోపే అందులో ఏదో ఉందని అర్ధం అయింది.తీరా అది ఓపెన్ చేశాక అందులో ఏముందో చూసి షాక్ అయ్యాడు.

దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

రాజస్థాన్‌లో( Rajasthan ) గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి.ముఖ్యంగా ఎడారి ప్రాంతం ఎక్కువగా ఉండడం, మరో వైపు పచ్చదనం తక్కువగా ఉండడంతో ఎండలు ఎక్కువగా ఉన్నాయి.బయటకు వచ్చిన వారికి ఎండదెబ్బ తగులుతోంది.

దీంతో వేసవిలో బయట దొరికిన చల్లని పానీయాలు తాగి గొంతు తడుపుకుంటున్నారు.ఇదే తరహాలో ఆ రాష్ట్రంలోని దుంగార్‌పూర్( Dungarpur ) ప్రాంతం పూజ్‌పూర్‌లో తాజాగా ఓ యువకుడు మాజా జ్యూస్ టెట్రా ప్యాకెట్ కొన్నాడు.

అందులో ఏదో కదులుతుందని అర్ధం అయింది.వెంటనే దానిని దుకాణాదారుడికి ఇచ్చాడు.

అతడితోనే దానిని ఓపెన్ చేయించాడు.ఆ జ్యూస్‌ను ఓ గిన్నెలో వారు పోశారు.

అప్పుడు అందులో జెర్రి కనిపించింది.దీంతో ఆ యువకుడు హడలిపోయాడు.

పొరపాటున దానిని తాగి ఉంటే తన పరిస్థితి ఏంటో ఊహించుకుని భయపడిపోయాడు.మరో వైపు ఆ దుకాణాదారుడు కూడా అందులోకి జెర్రి ఎలా వచ్చిందో తెలియక తికమక పడ్డాడు.

దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube