ఎంతో ఆశ పడి, ఎన్నో వ్యయప్రయాసలు కోర్చి, మరెంతో ఖర్చు చేసి కొనుక్కున్న కారుపైన( car ) బుద్ధున్నవాడు ఎవరైనా పేడ కొట్టుకుంటారా? అని ఆలోచించవద్దు.మీరు విన్నది నిజమే.
వేసవి కావడంతో భానుడు మండిపోతున్నాడు.ప్రతి చోటా ఎండలు దహించి వేస్తున్నాయి.
ఈ క్రమంలో హీట్ కు చెక్ పెట్టేందుకు ప్రజలు రకరకాలుగా ఆలోచిస్తున్నారు.ఇంట్లో చల్లగా ఉండేందుకు గోడలకు ఆవు పేడ ( cow dung )రాస్తున్నవారు కొందరు అయితే, తాము తిరుగుతున్న వాహనాలకు పేడ పులుముతున్నవారు కొందరు.

అవును, మీరు విన్నది నిజమే.ఓ ఓ హోమియోపతి వైద్యుడు( homeopathic physician ) వేడి నుంచి ఉపశమనం పొందేందుకు హోం రెమెడీతో ముందుకు వచ్చాడు.ఈ క్రమంలో తన కారుపై ఆవు పేడను పూశాడు, దాని కారణంగా కారు చల్లగా ఉంటుందని చెబుతున్నాడు.సాధారణంగా, మండే వేడిని వదిలించుకోవడానికి, ప్రజలు విలాసవంతమైన కార్లలో AC నడుపుతూ ప్రయాణిస్తారు.
కానీ బుందేల్‌ఖండ్‌లోని సాగర్‌లో, హోమియోపతి వైద్యుడు మాత్రం వేరేలా ఆలోచించాడు.కారు చల్లగా ఉండేందుకు ఆవు పేడతో దానిమీద పూత పూశాడు.

డాక్టర్ సుశీల్ సాగర్, జరుఖేడా ఆరోగ్య సేతు ( Dr.Sushil Sagar, Jarukheda Arogya Setu )ఆరోగ్య కేంద్రంలో పని చేస్తున్నారు.ఈ క్రమంలో అతగాడు మారుతీ ఆల్టో 800లో( Maruti Alto 800 ) ప్రయాణిస్తున్నాడు.ఈ రోజుల్లో ఎండ 41 డిగ్రీలకు చేరుకుంటుంది.దీంతో కారులో ప్రయాణించేటప్పుడు వేడి నుంచి ఉపశమనం పొందడానికి ఈ పద్ధతిని ఎంచుకున్నాడు.దీని వల్ల నేరుగా సూర్య కిరణాలు కారు కవర్ పై పడవని డాక్టర్ సుశీల్ సాగర్ చెబుతున్నారు.
దానిపై ఆవు పేడ ఉండడం వలన లోపల ఉష్ణోగ్రత కూడా చల్లగా ఉంటుంది.ఆవు పేడను కారు పైన పూయడం వల్ల బయటి వాతావరణం నుంచి వచ్చే వేడి లోపలికి వెళ్లదని వాహన నిపుణులు కూడా చెబుతున్నారు.







