” ఒక కన్ను ఇంకో కన్ను ను ఎలా పుడుచుకుంటుంది అధ్యక్షా.” అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy ) అసెంబ్లీ సాక్షిగా పలికిన మాటలు ఏపీ ప్రజల్లో ఎప్పుడు ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి.గత ఎన్నికలకు ముందు 2019 మార్చి లో జగన్ సొంత బాబాయ్ అయిన వివేకానంద రెడ్డి హత్య విషయంలో జగన్ చెప్పిన మాటలవి.ముందుగా గుండెపోటు అని చిత్రీకరించి ఆ తరువాత మర్డర్ అని తేలడంతో అప్పుడు ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు పై బురద చల్లే ప్రయత్నం చేశారు ఎప్పటి సిఎం జగన్మోహన్ రెడ్డి.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ తనకు ఏపీ పోలీసులపై నమ్మకం లేదని, వివేకా హత్య( Y.S.Vivekananda Reddy ) కేసును సిబిఐ కి అప్పగించాలనే కోరిన జగనే.తాను అధికారంలోకి వచ్చాక దొషులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని స్వయంగా సీబీఐ అధికారులే స్టేట్మెంట్ ఇచ్చారు.

ఈ కేసులో నిందితులుగా మొదటినుంచి వైఎస్ అవినాష్ రెడ్డి మరియు ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి పేర్లే ప్రధానంగా వినిపించాయి.దీంతో వివేకా హత్య కేసులో నిందితులకు ఏపీ సిఎం జగన్ ఎందుకు అండగా నిలుస్తున్నారు ? కేసు దర్యాప్తు ముందుకు సగకుండా ఎందుకు అడ్డుపడుతున్నారు ? అసలు వివేకా కేసులో జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా ఉందా ? అనే ఇలాంటి ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.ఈ ప్రశ్నలు ప్రతిపక్షాల నుంచి ఘాటుగా వినిపిస్తున్న నేపథ్యంలో .ఒక కన్ను ఇంకో కన్నును ఎలా పొడుచుకుంటుందని, తామంతా కుటుంబ సభ్యులమేనని, అవినాష్ రెడ్డి( Avinash Reddy ) నా తమ్ముడే అని దొషులకు అండగా నిలిచే ప్రయత్నం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.కట్ చెస్తే తాజాగా వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు.

వైఎస్ అవినాష్ రెడ్డిని కూడా ప్రధాన నిందితుడిగా చేర్చింది తెలంగాణ సీబీఐ.ఏ క్షణంలోనైనా అవినాష్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి.ముందస్తుగా అరెస్ట్ భయంతోనే బెయిల్ కోసం కోర్టును కుస ఆశ్రయించినట్లు తెలుస్తోంది అవినాష్ రెడ్డి.
ఈ నేపథ్యంలో దొషులకు అండగా నిలిచే ప్రయత్నం చేసిన జగన్ కు ఈ కేసు పెద్ద ముప్పే అని చెబుతున్నారు విశ్లేషకులు.
ఇంకా సీబీఐ విచారణలో వైఎస్ వివేకా హత్య కు ముందు హత్య జరిగిన తర్వాత వైఎస్ జగన్ మరియు ఆయన సతీమణి వైఎస్ భారతికి పోన్ కాల్ వెళ్ళినట్లు తెలుస్తోంది.
దీంతో జగన్ కు కూడా సీబీఐ నోటీసులు తప్పవా ? అనే ప్రశ్న తెరపైకి వస్తోంది.ఒకవేళ జగన్ కు సీబీఐ నెటీసులు వస్తే.
అది వచ్చే ఎన్నికల్లో వైసీపీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.మరి గత ఎన్నికల ముందు జరిగిన వివేకా హత్య.
ఈ ఎన్నికల ముందు జగన్ కు పెనుముప్పుగా మారిందని చెప్పక తప్పదు.