స్టార్ హీరో రామ్ చరణ్ కు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండగా ఆర్.ఆర్.
ఆర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జపాన్ కు వెళ్లిన చరణ్ అక్కడ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.చరణ్ ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ జపాన్ ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమ, అభిమానానికి మేం ఆశ్చర్యపోతున్నామని వెల్లడించారు.
ఈ విధంగా మా సినిమాను, మమ్మల్ని ఆదరిస్తున్న మీకు కృతజ్ఞతలు అనీ చరణ్ వెల్లడించారు.
తారక్ చెప్పిన విధంగా ఇది మా ఇంటిని తలపిస్తోందని మీరంతా మమ్మల్ని ఫ్యామిలీ మెంబర్స్ లా ఆదరిస్తున్నారని చరణ్ చెప్పుకొచ్చారు.
ఇది నిజంగా ఎమోషన్ కు గురి చేస్తుందని చరణ్ కామెంట్లు చేశారు.నేను మాట్లాడుకుంటే కొందరు ఫ్యాన్స్ కన్నీళ్లు పెట్టుకుంటున్నారని దీనిని నిజమైన ప్రశంసగా భావిస్తానని చరణ్ వెల్లడించారు.
ఈ స్థాయిలో ప్రేమను నేను జపాన్ నుంచి తీసుకెళుతున్నానని చరణ్ చెప్పుకొచ్చారు.

చరణ్ మాట్లాడుతున్న సమయంలో జపాన్ ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకుంటున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.రామ్ చరణ్ ఎమోషనల్ స్పీచ్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.చరణ్ ఒక్కో ప్రాజెక్ట్ కు 70 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.
ఆర్.ఆర్.ఆర్ సినిమాకు చరణ్ కేవలం 40 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను అందుకున్నారు.రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు.
ఈ సినిమాలోని పాటలు, యాక్షన్ సన్నివేశాల కోసం మేకర్స్ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.చరణ్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో చూడాల్సి ఉంది.
చరణ్ కు ఇతర రాష్ట్రాల్లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది.