బ్రిటన్ ప్రధానిగా రిషి సునక్‌ను కింగ్ చార్లెస్ ప్రకటించారు.బ్రిటన్ రాజు చార్లెస్ తో రిషి సునక్ సమావేశం ముగిసింది.
అనంతరం రిషి సునక్ బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.ఈ క్రమంలో రిషి సునక్ ను ప్రభుత్వ ఏర్పాటుకు చార్లెస్ ఆహ్వానించారు.
కాగా కాసేపటి క్రితమే రాజును కలిసిన లిజ్ ట్రస్ తన రాజీనామా లేఖను సమర్పించారు.ఈ సందర్భంగా బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునక్ మాట్లాడుతూ బ్రిటన్ ను ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేసేందుకు తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు.
ఈ నేపథ్యంలో తక్షణమే తను పని మొదలు పెడతానని చెప్పారు.కొన్ని కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి ఉందని ఆయన తెలిపారు.
అదేవిధంగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానన్నారు.బ్రిటన్ ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమిస్తామని తెలిపారు.
దేశాన్ని ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే తమ ప్రధాన అజెండా అని పేర్కొన్నారు.బ్రిటన్ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని రిషి సునక్ స్పష్టం చేశారు.
పారదర్శక పాలనను అందిస్తూ.అందరితో కలిసి పనిచేసి దేశాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.
పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేస్తామని వెల్లడించారు.
బ్రిటన్ చరిత్రలో ఓ భారత సంతతికి చెందిన వ్యక్తి ఆ దేశ ప్రధాని పదవిని చేపట్టడం ఇదే తొలి సారి.
ఇటీవలే జరిగిన ప్రధాని ఎన్నికల్లో సునాక్ పై విజయం సాధించిన లిజ్ ట్రస్ కేవలం 45 రోజులకే తన పదవికి రాజీనామా చేశారు.దీంతో రెండో మారు ప్రధాని పదవికి సునాక్ పోటీ చేసి పీఠాన్ని అధిరోహించారు.







