NTR30.. జాన్వీ ఫిక్స్.. ఒక్క పోస్టర్ తోనే భారీ హైప్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ ఎన్టీఆర్30.

ఈ సినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారో ఒక్క అప్డేట్ అంటూ అప్డేట్ కోసం కూడా ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ సినిమా ప్రకటించి ఏడాదికి పైగానే అవుతున్న ఇంకా సెట్స్ మీదకు తీసుకు వెళ్లలేక పోయాడు.ఇప్పటికీ ఇంకా షూట్ స్టార్ట్ చేయలేదు.

త్రిపుల్ ఆర్ సినిమా ఇచ్చిన హిట్ తో ఎన్టీఆర్ ఆ తర్వాత సినిమాలన్నీ పాన్ ఇండియా వ్యాప్తంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.ఈ క్రమంలోనే తన 30వ సినిమాను కొరటాల దర్శకత్వంలో ఫిక్స్ చేసాడు.

ఈ సినిమా ఎప్పుడో షూట్ స్టార్ట్ అవ్వాల్సి ఉండగా అనుకోని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది.ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి సాలిడ్ అప్డేట్ వచ్చింది.

Advertisement

ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను ఫిక్స్ చేసారని ఇప్పటికే కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి.మరి ముందు నుండి వస్తున్న వార్తలను నిజం చేస్తూ ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను కన్ఫర్మ్ చేస్తూ మేకర్స్ ఈ రోజు అదిరిపోయే పోస్టర్ ను రిలీజ్ చేసారు.జాన్వీ కపూర్ మార్చి 6న అంటే ఈ రోజు పుట్టిన రోజు జరుపు కుంటుంది.

ఈ సందర్భంగా మేకర్స్ ఈమెను ఈ సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ చేస్తూ అఫిషియల్ గా పోస్టర్ రిలీజ్ చేసారు.

ఈ పోస్టర్ లో జాన్వీ లంగావోణీతో ఆకట్టు కుంటుంది.సముద్రం బ్యాక్ డ్రాప్ లో ఉన్న ఈ పోస్టర్ తో ఈమె క్యారెక్టర్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నట్టు తెలుస్తుంది.చూడాలి డెబ్యూ సినిమాతో జాన్వీ ఇక్కడ మరిన్ని అవకాశాలు అందుకుంటుందో లేదో.

ఈ సినిమా వచ్చే ఏడాది 2024 ఏప్రిల్ 5న రిలీజ్ అవుతుంది అని మార్చి నుండి షూట్ స్టార్ట్ కాబోతుంది అని అధికారికంగా ప్రకటన వచ్చింది.మరి మేకర్స్ ఈ సినిమాను ఎప్పుడు స్టార్ట్ చేస్తారో చూడాలి.

ఖ‌ర్జూరాలు తినే ముందు ఇవి తెలుసుకోపోతే..మీ దంతాల‌కే ముప్పు జాగ్ర‌త్త‌!
Advertisement

తాజా వార్తలు