డైరెక్టర్ క్రిష్ తన కెరియర్ స్టార్టింగ్ లో సినిమాకోసం చాలా రకాలుగా ట్రై చేసారు…శర్వానంద్ తో గమ్యం అనే సినిమా తీసి మంచి విజయాన్ని అందుకున్నారు అలాగే ఆ తరువాత వేదం, కృష్ణం వందే జగదుగురుమ్ సినిమాలతో ఇండస్ట్రీ లో టాప్ డైరెక్టర్ గా మారారు.వాటి తర్వాత బాలయ్య బాబు హీరో గా గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా తీసి హిట్ కొట్టారు.
ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు అనే సినిమా తీస్తున్నారు.
ఇక ఇప్పుడు ఉన్న క్రిష్ గురించి మనకు తెలుసు కానీ ఆయన కెరియర్ స్టార్టింగ్ లో రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేద్దాం అని వెళ్లారట అప్పుడు వర్మ అడిగిన అన్ని క్వాషన్స్ కి కరక్ట్ గా ఆన్సర్స్ చెప్పారట అవి ఏం క్వశన్స్ అంటే సినిమా క్రాఫ్ట్ కు సంభందించినవి అప్పుడు వర్మ ఉండి నీకు అన్ని క్రాఫ్ట్స్ లో మంచి నాలెడ్జ్ ఉంది ఇక నువ్వూ నాదగ్గర వర్క్ చేసి టైం వెస్ట్ చేసుకోవడం దేనికి ఒక మంచి కథ రాసుకొని సినిమా డైరెక్షన్ చేసుకో అంతే తప్ప వాళ్లు దగ్గర వీళ్ళ దగ్గర అసిస్టెంట్ గా చేసి టైం వేస్ట్ చేసుకోకు అని చెప్పారట దానితో క్రిష్ ఆయన చెప్పినట్టు గానే గమ్యం కథ రాసుకొని శర్వానంద్ తో తీసి మంచి సక్సెస్ సాధించారు…
క్రిష్ తీసే సినిమాల్లో ఒక మధ్య తరగతి కుటుంభం పడే బాధలు ఎలా ఉంటాయి వాటిని ఎదుర్కోవడానికి కుటుంభం పడే కష్టాలు ఎలా ఉంటాయి అనే మార్గం లో క్రిష్ కథలు రాసుకొని సినిమాలు తీసి హిట్లు కొడుతూ ఉంటాడు…
.