పవన్ ఢిల్లీ టూర్ : అక్కడ వైసీపీ,జనసేన డిష్యుం డిష్యుం  ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయంగా అనేక విషయాల్లో క్లారిటీ తెచ్చుకునేందుకు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు.

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తుందని, ఆ పార్టీ రాష్ట్ర నాయకులు ప్రకటించిన నేపథ్యంలో జనసేన అక్కడి నుంచి బరిలో దిగేందుకు ప్రయత్నిస్తోంది .

ఈ క్రమంలోనే అక్కడ జనసేన అభ్యర్థిని బరిలో దించే నిమిత్తం ఢిల్లీ పెద్దలతో పవన్ మంతనాలు చేసేందుకు, పవన్ నాదెండ్ల మనోహర్ తో కలిసి ఢిల్లీకి వెళ్లారు.ఢిల్లీ టూర్ లో ఏ ఈ విధమైన డెవలప్మెంట్ లేకపోవడం, కేంద్ర బీజేపీ పెద్దలు ఎవరు పవన్ కు అపాయింట్ మెంట్ ఇచ్చినట్లుగా కనిపించకపోవడం వంటి వ్యవహారాలతో రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది.

ఇదిలా ఉంటే, పవన్ డిల్లీ టూర్ కు సంబంధించి ఏపీలో రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి.ముఖ్యంగా జనసేన వైసిపి కార్యకర్తల మధ్య వివాదం చెలరేగుతోంది.పవన్ కు బీజేపీ పెద్దలు కావాలని అపాయింట్మెంట్ ఇవ్వలేదు అని, కనీసం పొత్తు పెట్టుకున్నారు అనే గౌరవం కూడా ఇవ్వడం లేదంటూ వైసిపి సానుభూతిపరులు కొందరు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుండడం, జనసేన ను పవన్ కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తుండటంపై జనసైనికులు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.

దీనికి వారు సైతం గట్టిగానే కౌంటర్ అటాక్ ఇస్తూ, జగన్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని అనేక అంశాలపై ట్రోల్ చేస్తున్నారు.

Advertisement

గతంలోనూ జగన్ అనేకసార్లు జగన్ ఢిల్లీకి వెళ్లారని, అక్కడ ప్రధాని, కేంద్ర మంత్రులు అపాయింట్ మెంట్ కోసం ఎదురు చూశారని, వారు ఎవరు జగన్ ను పట్టించుకోకపోవడంతో, అనేకసార్లు వెనక్కి వచ్చారనే విషయాన్ని వైసిపి నాయకులు గుర్తుంచుకుంటే మంచిది అంటూ ట్రోల్ చేస్తున్నారు.దయచేసి ఈ విషయాన్ని రాజకీయం చేయవద్దని వారు వినతి తో కూడిన కౌంటర్ లు ఇస్తున్నారు.ప్రస్తుతం పవన్ ఢిల్లీ టూర్ వ్యవహారంపై వైసిపి జనసేన కార్యకర్తల మధ్య ఈ విధమైన ట్రోల్స్ నడుస్తూ, గతంలో నెలకొన్న అనేక పరిణామాలను హైలెట్ చేస్తూ, ఒకరిపై ఒకరు బురద చల్లుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

పవన్ డిల్లీ టూర్ లో ఏదో ఒక క్లారిటీ తో ఏపీలో అడుగు పెట్టే వరకు ఈ విధమైన ట్రోల్స్ కొనసాగే అవకాశం కనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు