జనసేనలో మొదటి నుంచి పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కు చేదోడు వాదోడుగా ఉన్న నాదెండ్ల మనోహర్( Nadendla Manohar ) పార్టీలో నెంబర్ టూ గా వ్యవహరిస్తుంటారు.పార్టీ వ్యవహారాలను ,సమావేశాలను సమీక్ష చేసుకుంటూ కోఆర్డినేట్ చేసే మనోహర్ నోటి నుంచి వచ్చే ప్రకటనలను దాదాపు జనసేన అధికార ప్రకటనల లాగానే భావించవచ్చు.
ఇటీవల మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్లలో పోటీ చేస్తామో తొందర్లోనే చెప్పేస్తామని ప్రకటించడం చర్చనీయాంశం గా మారింది ఆయన ప్రకటన ద్వారా జనసేన ఒంటరిగా పోటీ చేయదని కచ్చితంగా పొత్తులు ఉంటాయని తెలుగుదేశం భారతీయ జనతా పార్టీలతో కలిసి ముందుకు వెళ్తామని స్పష్టం చేసినట్లయ్యింది.
డాటా చౌర్యం విషయాలలో సాక్షాలతో సహా మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలలోని నిజాయితీని గుర్తించలేని అధికార పక్షం ఆయనపై కేసులు పెట్టించాలని చూస్తుందని సీఎంఓ ఆఫీసులోనే డేటా సౌర్యం జరుగుతుంటే ప్రభుత్వం ఇప్పటికే కళ్ళు తెరవడం లేదంటూ వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రస్థాయిలో జనసేన( Janasena ) ను బలోపేతం చేస్తే చర్యలకు పవన్ స్వీకారం చుట్టారని త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా కీలకమైన సమావేశాలు ఉంటాయని ఆయన తెలిపారు .అంతేకాకుండా అంతిమంగా రాష్ట్ర శ్రేయసే జనసేన లక్ష్యమని అందుకే పార్టీ పెట్టమని కూడా ఆయన ప్రకటించారు ప్రజా సంక్షేమం లక్ష్యంగానే పొత్తులు పెట్టుకుంటామని తెలుగుదేశమైనా భాజపాయైనా అంతిమ లక్ష్యం సామాన్య ప్రజలకు అధికార పలాలు అందించడమే అంటూ ఆయన చెప్పుకొచ్చారు.
తాను వచ్చే ఎన్నికల్లో తెనాలి నించే పోటీ చేస్తానంటూ ఆయన మరొకసారి పునరుద్ఘాటించారు .పార్టీలో ఇప్పటికే క్రియాశీలకంగా పనిచేస్తున్న నాయకులకు వచ్చే ఎన్నికలలో పోటీ చేసే అవకాశం కల్పిస్తామని ఆయన చెప్పకొచ్చారు .పార్టీ కోసం కష్టపడే నాయకులకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తామని రాబోయే తరాల కోసం కొత్త తరం నాయకులను తయారు చేయడమే జనసేన లక్ష్యం అంటూ కూడా మనోహర్ చెప్పుకొచ్చారు.అయితే ఎన్ని పరిణామాలు జరిగినప్పటికీ అంతిమంగా జనసేన పొత్తులతోనే పోటీ చేస్తుందని మనోహర్ ప్రకటించినట్లయ్యింది
.