రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పుంగనూరు అంశంపై పోలీస్ శాఖ చంద్రబాబుపై ( Chandrababu )వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.ఉద్దేశపూర్వకంగా తన శ్రేణులను రెచ్చగొట్టి ఘర్షణ వాతావరణానికి దారి తీసారని దానిపై చంద్రబాబును కేసులు పెట్టి విచారణ చేయించాలంట్టూ పోలీసు అధికారుల సంఘం వ్యాఖ్యానించింది.అయితే జరిగిన గొడవల్లో ఇరువర్గాల వ్యక్తులు ఉన్నప్పటికీ పోలీసులు( police ) తమ పార్టీ నేతలను మాత్రమే కావాలని ఇరికిస్తున్నారని, ఇప్పటికే 62 మంది అరెస్టు చేశారని పైగా అరెస్టు చేసిన వారిని దురుద్దేశ పూరకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, కోర్టులో హాజరు చేయకుండా నిర్భందించి బయబ్రాంతులకు గురి చేస్తున్నారని టిడిపి అధినేత వ్యాఖ్యానించారు
కేసులు పేరుతో తమ కీలక నాయకులను అరెస్టు చేసి మానసికంగా ఇబ్బందులకు గురి చేసే ఉద్దేశంతోనే పోలీస్ శాఖ ఇలా వ్యవహరిస్తుందంటూ ఆయన చెప్పుకొచ్చారు.అధికార పార్టీ అండ చూసుకొని తమ నేతలపై జులుం ప్రదర్శిస్తే మాత్రం అలాంటి అధికారులు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని వారిపై ప్రైవేటు కేసులు పెట్టి శిక్షపడేలా చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు .టిడిపి ( TDP party )నేతల పై తప్పుడు కేసులు పెట్టే పోలీస్ అధికారులను వదిలి పెట్టం ఖబడ్దార్ అంటూ చంద్రబాబు హెచ్చరించడం విశేషం.రాయలసీమ ప్రయోజనాలపై రాజీ పడుతన్న ప్రభుత్వనేతల చిత్తశుద్దిని బయటపేడుతున్నందుకే తమ యాత్ర లక్ష్యాలను డైవర్ట్ చేసేందుకు ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతుందంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.
మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా తాము వెనుకకు తగ్గమని రాయలసీమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని దీనిపై చర్చ జరగాల్సిందే అంటూ ఆయన చెప్పుకొచ్చారు .
అయితే పుంగనూరు కేసులో పూర్తి సాక్షాదారాలతో చట్టప్రకారమే తాము వ్యవహరిస్తున్నామని అరెస్టు చేస్తున్న వారికి సంబంధించి వీడియో ప్రూఫ్ లు కూడా ఉన్నందువల్లే అరెస్టు చేశామంటూ పోలీసు వర్గాలు చెబుతున్నాయి .అయితే ఇరువు వర్గాల దాడి జరిగినప్పుడు కేవలం ఒక వర్గం వారి పైన కేసులు ఎలా నమోదు చేస్తారంటూ ప్రశ్నలు వినిపిస్తున్నాయి.