సూపర్ స్టార్ రజినీకాంత్( Superstar Rajinikanth ) మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఈ మధ్య కాలంలో రజినీకాంత్ సినిమాల్లో బ్లాక్ బస్టర్ సాధించిన సినిమా లేదు అనే చెప్పాలి.
అందుకే ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.అయితే ఈసారి చేస్తున్న సినిమాకు ముందు నుండే పాజిటివ్ వైబ్స్ రావడంతో ఫ్యాన్స్ ఎన్నో ఆశలను పెట్టుకున్నారు.
ప్రెజెంట్ రజనీకాంత్ చేస్తున్న సినిమా ‘‘జైలర్”( Jailer ).ఈ సినిమాపై ఈ మధ్య కాలంలో ఎప్పుడు లేనంత హైప్ నెలకొంది.మరి రిలీజ్ కు కూడా రెండే రోజులు ఉండడంతో ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది.హైప్ చూస్తుంటే ఈసారి సూపర్ స్టార్ రేంజ్ కు తగ్గ హిట్ పడేలానే ఉంది.
ఈ సినిమాను ఆగస్టు 10, 2023న రిలీజ్ చేయబోతున్న విషయం విదితమే.ఈ క్రమంలోనే జైలర్ సినిమా ఎన్నో రికార్డులను క్రియేట్ చేస్తూ మరికొన్ని రికార్డులను నెలకొల్పుతూ ఉంది.
తాజాగా ఈ సినిమా బెంగుళూరు సిటీలో ఒక మాసివ్ ఫీట్ ను సెట్ చేసుకున్నట్టు తెలుస్తుంది.ఏంటంటే.
జైలర్ సినిమాకు ఈ మధ్య వచ్చిన అవతార్ 2, కేజిఎఫ్ 2( KGF 2 ) సీక్వెల్స్ కంటే కూడా రికార్డ్ షోస్ ను ఏర్పాటు చేశారట.దీంతో రజినీకాంత్ స్టామినా బయట పడింది.
ఇప్పటి వరకు బెంగుళూరులో హైయెస్ట్ షోస్ లిస్టులో అవతార్ 2( Avatar 2 ) కి 1014 ఉండగా కేజిఎఫ్ 2 కు 1037 షోస్ వేశారు.అయితే ఇప్పుడు వీటిని వెనిక్కి నెడుతూ జైలర్ కు ఏకంగా 1093 షోస్ ను కేటాయించినట్టు తెలుస్తుంది.దీంతో ఇప్పుడు బిగ్గెస్ట్ రికార్డ్ అయితే రజినీకాంత్ పేరు మీదకు వచ్చింది.ఇక సన్ పిక్చర్స్ వారు భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటించగా అనిరుద్ సంగీతం అందించారు.