ఏపీ రాజ‌కీయాల్లో ఆశావాదంగా మారుతున్న జ‌న‌సేన‌.. ప‌వ‌న్ ఇక‌నైనా జోరు పెంచుతారా..?

రాజ‌కీయాల్లో కొంద‌రికి మాత్ర‌మే అన్ని ర‌కాల అవ‌కాశాలు, అదృష్టాలు ఉంటాయి.కొత్తగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చే వారి గురించి ప్ర‌జ‌ల‌కు బాగా తెలిసి ఉంటేనే వారు రాణించ‌గ‌లుగుతారు.

ప్ర‌జ‌ల‌కు తెలియ‌ని వారికి ఇక్క‌డ రాణించాలంటే క‌త్తిమీద సాము లాంటిదే.కానీ ప‌వ‌న్ కల్యాణ్‌కు అలాంటి అవ‌స‌రం లేదు.

ఆయ‌న మొద‌టి నుంచి ప‌వ‌ర్ స్టార్‌గా ఏపీ, తెలంగాణ ప్ర‌జ‌ల‌కు సుప‌రిచితుడే.ఆయ‌న‌కు ఉన్న ఫాలోయింగే అయన‌కు జ‌న‌సైనికుల‌ను తెచ్చి పెట్టింది.

ఒక క‌మిట్ మెంట్‌తో ప‌నిచేసే కార్య‌క‌ర్త‌ల‌ను ఆయ‌న పార్టీకి ఇచ్చింది.ఇది ఆయ‌నకు బాగా క‌లిసి వ‌చ్చే అంశం.

Advertisement

ఆయ‌న అంత దారుణంగా గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయినా కేడ‌ర్ మాత్రం జ‌న‌సేన‌ను విడిచి ఎక్క‌డ‌కూ వెళ్ల‌లేదు.మ‌రింత ఉత్సాహంగా ప‌నిచేస్తూనే ఉంది.

అయినా ప‌వ‌న్ మాత్రం వీరికి పూర్తి స్థాయిలో అండ‌గా నిల‌బ‌డ‌లేక‌పోతున్నార‌ని వారి వాద‌న.ఆయ‌న ఎప్పుడో ఒక‌సారి మాత్ర‌మే వ‌స్తార‌ని మిగ‌తా స‌మ‌యంలో వారికి దిశా నిర్దేశం చేయ‌ట్లేద‌ని అంటున్నారు.

కానీ ప‌వ‌న్ ఎలాంటి ఆదేశాలు పెద్ద‌గా ఇవ్వ‌క‌పోయినా తామంత‌ట తామే వ‌రుస స్థానిక, ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో పోటీ చేసి జనసైనికులు మంచి విజ‌యాన్నే సాధించారు.ప‌వ‌న్ ఎలాంటి ప్ర‌చారం చేయ‌క‌పోయినా వారు అన్ని సీట్లు గెలిచారంటే మామూలు విష‌యం కాద‌నే చెప్పాలి.

ఇక మొన్న జ‌రిగిన మున్సిపాలిటీ ఎన్నిక‌ల్లో కూడా పవన్ ప్రచారం లేదు.కానీ జ‌న‌సైనికులు బాగానే సీట్లు గెలుచుకున్నారు.ఇలా వ‌రుస ఎన్నిక‌ల్లో జ‌న‌సేన స్పీడును చూస్తుంటే జ‌నాలు దీన్ని ఒక ఆశావాదంగానే చూస్తున్నారు.

త్రివిక్రమ్ కథ చెప్తుంటే పవన్ కల్యాణ్ నిద్ర పోతే, మహేష్ బాబు లేచి వెల్లిపోయారట
వైసీపీ కార్యాలయం కూల్చివేత పై జగన్ ఏమన్నారంటే ? 

కానీ ముందుండి న‌డిపించే నాయ‌కుడు ప‌వ‌న్ మాత్రం అంద‌రినీ నిరాశ‌కు గురి చేస్తోంది.ఆయ‌న నిత్యం ప్ర‌జ‌ల్లో ఉండి కార్య‌క‌ర్త‌ల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు మీటింగులు పెడ‌తూ దిశా నిర్దేశం చేస్తూ ఉంటే మ‌రింత బ‌లోపేతం అయ్యే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.

Advertisement

ఇలాంటి ప‌నులు చేయ‌నంత కాలం ప‌వ‌న్ మీద పెట్టుకున్న ఆశ‌లు నిజం కావ‌ని చెబుతున్నారు.

తాజా వార్తలు