దయచేసి నన్ను కులాల రొచ్చు లోకి లాగొద్దు ! నేను కొందరివాడిగా ఉండదలుచుకోలేదు అందరివాడిగా ఉండాలి అనుకుంటున్నాను అంటూ గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు.అది నిజమే అనుకుని అందరూ అనుకున్నారు.
ఇక పవన్ పార్టీ లో కూడా అందరికి ప్రాధాన్యం దక్కుతుందని అంతా భావించారు.కానీ వాస్తవ పరిస్థితుల్లోకి వచ్చేటప్పటికి అదంతా కేవలం మాటల వరకే పరిమితం అని తేలిపోయింది.
పార్టీలోని కీలక పదవుల నియామకంలో ఆయన వేసిన సామాజిక సమీకరణాలు, లెక్కలు తప్పాయి.అన్ని వర్గాలకు ప్రాధాన్యం కల్పించాల్సిన ఆయన.తమ సామాజిక వర్గానికే పెద్ద పీట వేసి కీలక బాధ్యతలు అప్పగించడంపై ఇప్పుడు అనేక విమర్శలు చెలరేగుతున్నాయి.
జనసేన తాజాగా ప్రకటించిన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ`అంత పవన్ సామాజిక వర్గం వారే కనిపిస్తున్నారు.
ఈ కమిటీలో పవన్ ఛైర్మెన్ గా ఉండగా .మాదాసు గంగాధరం కన్వీనర్‌గా మరో ముగ్గురిని సభ్యులుగా నియమించారు.ఇందులో తోట చంద్ర శేఖర్, మారిశెట్టి రాఘవయ్య, ఆష్రం యూసఫ్ ఉన్నారు.యూసుఫ్ మినహా మిగిలిన వారంతా ఒకే సామాజికవర్గానికి చెందిన వారు.పొలిటికల్ సెక్రటరీగా ప్రస్తుతం మీడియా అడ్వైజర్ గా ఉన్న పసుపులేటి హరిప్రసాద్ ను నియమించారు.ఆయన కూడా అదే సామాజికవర్గం.
స్టేట్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ గా 15 మందిని, స్టేట్ బూత్ కోఆర్డినేటర్లుగా ఐదుగురిని, జనసేన లీగర్ కమిటీ చైర్మన్ గా కె.చిదంబరం అనే వ్యక్తిని నియమించారు.వీరిలో ఒక ముస్లిం, ఒకరిద్దరు బీసీ నేతలున్నారు.కానీ ఇతర సామాజిక వర్గాలకు అవకాశం దక్కలేదు.ఇక కొత్త అధికార ప్రతినిధిగా సీనియర్ జర్నలిస్ట్ విజయబాబును నియమించారు.ఆయన కూడా పవన్ న్యాయం చేసే సామాజికవర్గానికి చెందిన వారే.
తనకు కులం లేదని చాలా ఆవేశంగా ప్రకటించే పవన్ కల్యాణ్.అధికారం ఒక్కరిదేనా అని ఆవేశంగా ప్రసంగాలు ఇస్తూ ఉంటారు.అధికారం అందరిదీ అని నినదిస్తూ ఉంటారు.కానీ ఆచరణలో మాత్రం అవేమీ కనిపించలేదు.
ఓ పార్టీ అత్యున్నత నిర్ణాయక వ్యవస్థలో అందరికీ ప్రాతినిధ్యం కల్పించడం ఆనవాయితీ.కానీ పవన్ మాత్రం ఐదుగురిలో నలుగురిని ఒకే సామాజికవర్గం వారికి చోటు కల్పించారు.
ఈ కమిటీలు చూసిన తర్వాత జనసేన కోసం ఇంత వరకూ పని చేసిన వారు నిరాశకు గురయ్యారు.