ఇలా అయితే జనసేన నష్టపోవాల్సిందేనా ?  

ఏపీలో టీడీపీ జనసేన పొత్తు( TDP Janasena Alliance ) పెట్టుకోవడమే కాకుండా ఉమ్మడిగా కార్యచరణను రూపొందించుకుని ముందుకు వెళ్తున్నాయి.

వైసిపి మళ్లీ అధికారంలోకి రాకుండా చేయడమే లక్ష్యంగా ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరింది.

ఇక ఎన్నికల వరకు వివిధ ప్రజా సమస్యలపై పోరాటం చేపట్టే విధంగా రెండు పార్టీలు ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేసే పనుల్లో నిమగ్నం అయ్యాయి.ఖచ్చితంగా టిడిపి,  జనసేన కలిసి పోటీ చేస్తే అధికారంలోకి వస్తామనే నమ్మకం అటు చంద్రబాబులోనూ , ఇటు పవన్ లోనూ కనిపిస్తోంది.

జనసేన( Janasena ) ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కునే అంత స్థాయిలో బలం లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో టిడిపి తో పొత్తు పెట్టుకున్నారు .ఇక టిడిపి పరిస్థితి అదే విధంగా ఉంది.2019 ఎన్నికల్లో టిడిపి 23 సీట్లకి పరిమితం అయింది.ప్రస్తుతం వైసీపీ బలంగా ఉండడం,  క్షేత్రస్థాయిలో వివిధ పథకాలు ప్రజలకు అందించి ప్రజల మద్దతు కూడగట్టుకోవడంతో టిడిపి ఒంటరిగా పోటీ చేసినా,  వైసీపీ( YCP )ని ఓడించే సత్తా లేదనే విషయాన్ని గ్రహించి జనసేనతో పొత్తుకు మొగ్గు చూపించారు.

ఇదిలా ఉంటే టిడిపి జనసేన మధ్య సీట్ల సర్దుబాటు ఏ విధంగా ఉంటుందనేది అందరికీ ఆసక్తికరంగా మారింది .ఇక్కడ జనసేనకు కేటాయించబోయే సీట్ల గురించి టిడిపి ప్రస్తావించడం లేదు.ఎన్నికల సమయంలోనే ఆ సీట్ల సర్దుబాటు గురించి చర్చించాలనే అభిప్రాయంతో ఉంది.

Advertisement

ప్రస్తుతం ఏపీ( AP Politics )లో చాలా నియోజకవర్గాల్లో జరిగిన టిడిపి , జనసేన సమన్వయ కమిటీ సమావేశాలు సీట్ల విషయమై వివాదాలు చోటు చేసుకోవడంతో ముందుగానే సీట్ల సర్దుబాటు విషయాన్ని టిడిపి దగ్గర జనసేన తేల్చుకోకపోతే ఎన్నికల సమయంలో జరిగే నష్టం తీవ్రంగా ఉంటుంది .

టిడిపి పొత్తు ధర్మాన్ని విస్మరించి పవన్ ఆశిస్తున్న స్థాయిలో కాకుండా అరకొర సేట్లను జనసేనకు కేటాయిస్తే  ఎన్నికల సమయంలో జనసేన తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుంది.  ఇప్పటికే జనసేన కేడర్ లోనూ టిడిపి తో పొట్టు విషయంపై అసంతృప్తి ఉంది.  అయినా పవన్( Pawan Kalyan ) నిర్ణయం పై గౌరవంతో వారంతో సైలెంట్ గా ఉన్నారు.

కానీ సీట్ల విషయంలో పవన్ ముందుగా మేల్కొనకపోతే జరిగే నష్టం తీవ్రంగా ఉంటుందనే భయం జనసేన వర్గాల్లో నెలకొంది.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు