Janasena Pawan Kalyan : పొత్తుల చాయిస్ లో పవన్ ఆప్షన్ ఏంటి ? 

ఎన్నికల సమయం దగ్గర పడేకొద్దీ ఏపీ రాజకీయాలు చిత్ర, విచిత్ర మలుపులు తిరుగుతున్నాయి.ముఖ్యంగా ఏపీ అధికార పార్టీగా ఉన్న వైసీపీని ఓడించేందుకు టిడిపి, జనసేన, బిజెపి లు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి.

 Janasena Pawan Kalyan On Alliance With Tdp And Bjp,tdp, Chandrababu, Ys Jagan,ys-TeluguStop.com

అయితే ఒంటరిగా జగన్ ను ఓడించడం అషామాషి కాదనే విషయం మిగతా పార్టీలన్నిటికీ బాగా తెలుసు.అందుకే పొత్తుల ద్వారానే జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించి తమ లక్ష్యాన్ని చేరుకోవచ్చని మిగతా పార్టీలు భావిస్తున్నాయి.

ప్రస్తుతం ఏపీలో జనసేన బీజేపీ పొత్తు కొనసాగిస్తున్నా.ఆపొత్తు పేరుకే తప్ప మిగతా ఏ విషయంలోనూ ఏకాభిప్రాయం లేదనే విషయం అందరికీ అర్థమైంది.

బిజెపితో వెళ్లడం కంటే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళితే సక్సెస్ అవ్వచ్చు అనే లెక్కల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారు.

ఏపీలో బిజెపికి ఓటింగ్ శాతం అంతంత మాత్రమే ఉందని,  కేంద్రంలో ఆ పార్టీ అధికారంలో ఉండడం వల్ల తమకు కాస్తో కూస్తో కలిసి రావడం తప్పించి, ఏపీ బీజేపీ వల్ల తమకు పెద్దగా కలిసి వచ్చేదేమీ లేదనే లెక్కల్లో పవన్ ఉన్నారు.

అందుకే 2024 ఎన్నికల్లో టిడిపి తో జతకట్టేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు.దీనికి టిడిపి అధినేత చంద్రబాబు కూడా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.చాలా కాలం బిజెపికి దూరంగానే ఉంటూ వస్తున్న పవన్ అనూహ్యంగా రెండు రోజుల క్రితం విశాఖకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోది తో భేటీ అయ్యారు.

Telugu Ap, Chandrababu, Janasena, Janasena Bjp, Janasenani, Narendra Modi, Pawan

దాదాపు 8 ఏళ్ల తర్వాత పవన్ మోది తో భేటీ కావడం తో కీలక పరిణామాలే చోటు చేసుకోబోతున్నాయని అంత అంచనా వేశారు.అయితే వీరి భేటీ లో ఏం జరిగిందనే విషయం క్లారిటీ లేకపోయినప్పటికీ టిడిపిని కలుపుకుని వెళితే 2024 ఎన్నికల్లో విజయం సాధించవచ్చు అని పవన్ చెప్పినా… దానికి ప్రధాని ఏ సమాధానమూ చెప్పలేదట.ఇదిలా ఉంటే గతంలోనే పవన్ రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు మూడు ఆప్షన్లను ప్రకటించారు.

జనసేన, బిజెపి కలిసి పోటీ చేయడం, టిడిపి, జనసేన ,బిజెపి కలిసి పోటీ చేయడం, జనసేన ఒంటరిగా పోటీ చేయడం.అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ ఒంటరిగా పోటీ చేసే సాహసం అయితే చేయరు.

ఎందుకంటే 2019 ఎన్నికల్లో జనసేన బీఎస్పి వంటి పార్టీలను కలుపుకుని ఎన్నికల్లో పోటీ చేసినా.కేవలం ఒక్క స్థానంతో మాత్రమే సరి పెట్టుకోవాల్సి వచ్చింది.

 ఇదిలా ఉంటే పవన్ ప్రధాని మోదీతో బయటికి వచ్చిన తర్వాత రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయని ప్రకటించడంతో జనసేన కార్యకర్తలు అయోమయానికి గురయ్యారు.అంటే రాబోయే ఎన్నికల్లో జనసేన, బిజెపి కలిసి పోటీ చేస్తాయో లేక టిడిపి , జనసేన ,బిజెపిలు కలిసి పోటీ చేస్తాయో అనేది సొంత పార్టీ నేతలకు అర్థం కాలేదు.

అసలు టిడిపి తో కలిసి వెళ్లాలా ? బీజేపీతో ముందుకు వెళ్లాలా అనే విషయంలో పవన్ ఏ ఆప్షన్ తీసుకోలేకపోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube