మ‌రో అస్త్రంతో ప‌వ‌న్ రెడీ   Pawan Next Target Ongole     2017-01-12   01:26:41  IST  Bhanu C

జ‌నసేన‌ను సంస్థాగ‌తంగా బ‌లోపేతం చేసి.. ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ సిద్ధ‌మ‌వుతున్నారు. భారీ స‌మావేశాల ద్వారా పార్టీకి జ‌వ‌సత్వాలు నింపాల‌ని కృత‌నిశ్చ‌యంతో ఉన్నారు. 2019 ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించిన ప‌వ‌న్‌… ఈలోగా పార్టీని ప‌టిష్ఠం చేసే ప‌నిలో ప‌డ్డారు. ముఖ్యంగా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను వెలుగులోకి తీసుకొచ్చేందుకు అన్ని జిల్లాల్లో స‌భ‌లు నిర్వ‌హిస్తున్న జ‌న‌సేనాని ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌పై స‌మ‌ర శంఖం పూరించేందుకు సమాయ‌త్త‌మ‌వుతున్నాడు.

2019 ఎన్నిక‌ల‌కు జ‌న‌సేనాని ప‌క్కా వ్యూహంతో ముందుకెళుతున్నాడు. ముఖ్యంగా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటాన్ని కొన‌సాగిస్తున్నాడు. ఇప్ప‌టికే కాకినాడ‌, తిరుప‌తి, అనంత‌పురం జిల్లాల్లో భారీ బ‌హిరంగ స‌భ‌లు నిర్వ‌హించి అటు రాష్ట్ర స‌మ‌స్య‌ల‌పైనే గాక.. ఆ ప్రాంతంలోని సమ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వ దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్క‌రించేలా ప్ర‌భుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నాడు. ప్ర‌శ్నించ‌డానికే వ‌చ్చాన‌ని, ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై పోరాడ‌ట‌మే త‌న ల‌క్ష్య‌మ‌ని పార్టీ స్థాపించిన‌పుడు చెప్పిన మాట‌ల‌ను నెర‌వేరుస్తున్నాడు.

కాగా జనసేన అధినేత త్వరలో మరో బహిరంగ సభ ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. తన తదుపరి సభను ఒంగోలులో నిర్వహించనున్నట్లు స‌మాచారం. జనవరి చివరి వారంలో ఇది జరిగే అవకాశం ఉన్నట్లు జనసేన వర్గాల స‌మాచారం. అక్కడ స్థానికంగా ఒంగోలు జిల్లాలో ఉన్న సమస్యలపై పవన్ ఇందులో ప్ర‌స్తావిస్తార‌ని తెలుస్తోంది.

మెగా పుడ్ పార్క్, ఉద్దానం కిడ్నీ సమస్యలతో బాధ‌ప‌డుతున్న వారితో ముఖాముఖి సమావేశాలు కూడా ఏర్పాటు చేసి వారి సమస్యలను హైలైట్ చేసిన విష‌యం తెలిసిందే! అయితే ఇప్పుడు ఒంగోలు ఏ స‌మ‌స్య‌పై ప‌వ‌న్ మాట్లాడ‌తాడోన‌ని ప్ర‌స్తుతం చ‌ర్చ న‌డుస్తోంది. ఇక్క‌డ ప‌వ‌న్ లేవ‌నెత్త స‌మ‌స్యపై టీడీపీ వ‌ర్గాలు సైతం ఉత్కంఠ‌తో వెయిట్ చేస్తున్నాయి.