విజయవాడ: జనసేన నేత పోతిన వెంకట మహేష్. ఢిల్లీలో పవన్ కళ్యాణ్ కు దక్కిన గౌరవంతో జగన్ లో భయం పట్టుకుంది.
నిజాయతీగా ఉన్న వ్యక్తి కాబట్టే జాతీయ నాయకులు అయినా ఎదురేగి స్వాగతం పలికారు.జగన్ లాగా కేసులు, అప్పులు కోసం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలు చేయడం లేదు.
రాష్ట్ర అభివృద్ది, ప్రజల సంక్షేమం కోసమే యన్డీఎ సమావేశంలో పవన్ పాల్గొన్నారు.ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలన్ని పవన్ కళ్యాణ్ గారి చుట్టూనే తిరుగుతున్నాయి.
వాలంటరీ వ్యవస్థలోని లోపాలను బహిర్గతం చేయడంతో వైసీపీకి ఓటమి భయం పట్టుకుంది.పవన్ వ్యాఖ్యలతో వైసీపీ నాయకులకు వారి భవిష్యత్తు ఏంటో వారికి స్పష్టంగా తెలిసిపోయింది.
వాలంటరీ వ్యవస్థ పై ఆరోపణలు చేశారని పవన్ కళ్యాణ్ గారిపై కేసు నమోదు చేయడం వింతగా ఉంది.
వైసీపీ ఉద్దేశపూర్వకంగా ప్రజల దృష్టిని పక్కదారి మళ్ళించడానికే ఈ కేసులు.13 సిబిఐ మూడు ఈడి కేసులు ఉన్న వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవ్వగా లేనిది.ప్రజల కోసం పోరాడుతున్న పవన్ కళ్యాణ్ గారిపై కుట్రతో ఒకటి అర కేసులు పెడితే.
పవన్ కళ్యాణ్ గారి చిటికిన వేలు మీద వెంట్రుక కూడా కదలదు.పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్నలకు వైసీపీ నాయకులు దమ్ముంటే సమాధానం చెప్పాలి.
వాలంటీర్ల వ్యవస్థకు అధిపతి ఎవరు సీఎం, ఎంపీ ఎమ్మెల్యే కలెక్టర్ ఎవరు? ముందు ప్రజలకు సమాధానం చెప్పండి.







