కెరియర్ మొదట్లో ఆ స్టార్ హీరోల సినిమాలకి అసిస్టెంట్లు గా చేసిన హీరోలు...

ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేక‌పోయినా డైరెక్ట‌ర్ అవ్వాల‌ని ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టి…ఊహించ‌ని విధంగా న‌టుడై, ఆ త‌ర్వాత స్టార్ హీరోగా నిల‌దొక్కుకున్నాడు.టాలీవుడ్ లో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ తో పాటు భారీ ఫాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు.

 The Heroes Who Acted As Assistants In The Films Of Those Star Heroes In The Begi-TeluguStop.com

ప్ర‌స్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో దూసుకుపోతున్నాడు.త్వ‌ర‌లోనే ర‌వితేజ ( Ravi Teja )టైగర్ నాగేశ్వరరావు మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌నున్నాడు.

వంశీకృష్ణ నాయుడు ఈ మూవీకి ద‌ర్శ‌కుడు.ఆక్టోబ‌ర్ లో ఈ సినిమా విడుద‌ల కానుంది.

 The Heroes Who Acted As Assistants In The Films Of Those Star Heroes In The Begi-TeluguStop.com

అలాగే ర‌వితేజ మ‌రోవైపు ఈగ‌ల్( Eagle ) అనే మ‌రో సినిమా చేస్తున్నాడు.కార్తీక్‌ ఘట్టమనేని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో అనుప‌మ ప‌రమేశ్వ‌ర‌న్ కీల‌క పాత్ర‌ను పోసిస్తోంది.

ఈ మూవీ షూటింగ్ ద‌శ‌లో ఉంది.

Telugu Eagle, Indragantimohan, Nani, Ravi Teja, Srinu Vaitla-Movie

ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే.కెరీర్ ఆరంభంలో ర‌వితేజ కృష్ణ వంశి , రాఘవేంద్ర రావు , ఈవీవీ సత్యనారాయణ ఇలా ఎంతో మంది దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా వ‌ర్క్ చేశాడ‌న్న సంగ‌తి అంద‌రికీ తెలుసు.అయితే అలా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ( Pawan Kalyan )న‌టించిన ఓ మూవీ కూడా ర‌వితేజ ప‌ని చేశాడు.

ఇంత‌కీ ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా వ‌ర్క్‌ చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూవీ మ‌రేదో కాదు.`అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి.

Telugu Eagle, Indragantimohan, Nani, Ravi Teja, Srinu Vaitla-Movie

ప‌వ‌న్ క‌ళ్యాణ్ డెబ్యూ మూవీ ఇది.ఈవీవీ సత్యనారాయణ డైరెక్ట్ చేసిన గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మించారు.ఇందులో నాగార్జున మేన‌కోడ‌లు సుప్రియ యార్లగడ్డ హీరోయిన్ గా న‌టించింది.1996లో విడుద‌లైన ఈ సినిమా ఓ మోస్త‌రు హిట్ అయింది.అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌ట‌న‌కు మాత్రం విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు ద‌క్కాయి.చాలా మందికి తెలియ‌ని విష‌యం ఏంటంటే.ఈ సినిమాకు ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేశాడు.ఆ టైమ్ లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు అనేక స‌న్నివేశాల‌ను ర‌వితేజ వివ‌రింగా చెప్పేవాడ‌ట‌.

ఇక ఆ త‌ర్వాత ర‌వితేజ‌ న‌టుడిగా బిజీ అయిపోయాడు.ద‌ర్శ‌క‌త్వంపై ఇంట్రెస్ట్ ఉన్నా.

ఆవైపు చూడ‌కుండా స్టార్ హీరోగా ఎదిగాడు.ఇక రవితేజ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసి తర్వాత హీరో అయిన వాళ్లలో నాని( Nani ) ఒకరు నాని కెరియర్ మొదట్లో బాపు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాడు.

ఇక ఆ తర్వాత శ్రీను వైట్ల దగ్గర కూడా చేశాడు…ఇక ఆ తర్వాత ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్ లో వచ్చిన అష్టచమ్మ మూవీ తో హీరో గా మారిపోయాడు ఇక ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఒక మంచి హీరోగా నిలదొక్కుకున్నాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube