ఆ సిద్ధాంతాలు జనసేన లో కనిపించడం లేదు ఏంటి పవన్ ?

జనసేన పార్టీ ఆవిర్భావ సమయంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నో విషయాలు ప్రస్తావించారు.

సాంప్రదాయ రాజకీయాలకు జనసేన దూరంగా ఉంటుందని, ప్రజలకు తాము సరికొత్త రాజకీయం చూపిస్తామని, తమకు కులాలు, మతాలు లేవని, ప్రజాసంక్షేమమే ఏకైక లక్ష్యమని పవన్ చెప్పారు.

అంతేకాకుండా తాము అధికారం కోసం జనసేన పార్టీని స్థాపించ లేదని , ప్రజా సమస్యల విషయంలో ప్రభుత్వాలను ప్రశ్నించేందుకు తాము పార్టీ పెట్టమని పవన్ చెప్పారు.అయితే కొద్ది రోజులు గడిచేసరికి పవన్ ఆ సిద్ధాంతాలను పక్కన పెట్టేసినట్టుగా కనిపించారు.

2014 శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం, బిజెపి కూటమికి పవన్ మద్దతు పలికారు.ఆ తర్వాత ప్రజా సమస్యల విషయంలో పవన్ టిడిపి ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు మొహమాట పడ్డారు.బిజెపి విషయంలోనూ ఇదేవిధంగా వ్యవహరించారు.

బీజేపీ, టీడీపీలకు వ్యతిరేకంగా తాను పోరాడుతాను అంటూ వామపక్ష పార్టీలతో కలిసి మొన్నటి ఎన్నికల్లో పోటీకి దిగారు.అయితే ఫలితాలు మాత్రం జనసేన ను కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి.

Advertisement

వామపక్ష పార్టీలతో పొత్తు రద్దు చేసుకున్న పవన్ ఇప్పుడు గతంలో తనను విమర్శించిన బీజేపీతో జత కలిశారు.ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి ముందుకు నడుస్తున్నాయి.

ఇవన్నీ జనసేన సిద్ధాంతాలకు విరుద్దం అయినా, పవన్ మాత్రం మరో దారి లేక గతంలో తాను విమర్శించిన సాంప్రదాయ రాజకీయ పార్టీల బాటలోనే నడుస్తున్నారు.ఇక్కడ కూడా జనసేన పార్టీ తప్పటడుగులు వేస్తోంది.

బిజెపితో కలిసి ముందుకు వెళదాం అని నిర్ణయాలు తీసుకున్నాక గోదావరి జిల్లాలతో పాటు మరికొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీతో లోపాయికారి రకంగా పొత్తు పెట్టుకుని ముందుకు వెళుతుంది జనసేన.దీనిపై వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నా పవన్ దగ్గర సమాధానం మాత్రం కరువైంది.వామపక్ష పార్టీలతో పొత్తులు తెగ తెంపులు చేసుకున్నా, విజయవాడ , విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో సిపిఐ, సిపిఎం పార్టీలు కలిసి పోటీ చేసేందుకు స్థానిక జనసేన నాయకులు నిర్ణయం తీసుకున్నారు.

దీంతో అసలు జనసేన ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంది అనే విషయం జనాలకు అర్థం కావడం లేదు.మొదటి నుంచి ఇదే రకమైన కన్ఫ్యూజన్ జనసేన పార్టీలోనూ, ఆ పార్టీ అధినేత పవన్ లోనూ కనిపిస్తూనే ఉన్నాయి.

వీడియో వైరల్ : మూఢనమ్మకంతో చనిపోయిన వ్యక్తిని నీటిలో వేలాడదీసిన గ్రామ ప్రజలు.. చివరకు..?!
Advertisement

తాజా వార్తలు