తెలుగును బతికిద్దాం.తెలుగువారిగా జీవిద్దాం.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు.తెలుగును బతికిద్దాం తెలుగు వారిగా జీవిద్దామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు తెలుగు వాడుకు భాష పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా ఆయనకు పవన్ కళ్యాణ్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం అదృష్టంగా పేర్కొన్నారు.
ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్, అజంత భాషా, అమర భాషా తెలుగని అన్నారు.నేటి పాలకుల చర్యలతో తెలుగు భాష కనుమరుగయ్యే పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు ఒకప్పుడు దేశంలో తెలుగు భాష రెండో స్థానంలో ఉంటే ఇప్పుడు ఐదో స్థానానికి పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగు మీడియంలో చదువుకునే వారి సంఖ్య 27 శాతానికి మించి లేదని ఇదే పరిస్థితి కొనసాగితే మరో ఐదు దశాబ్దాల్లో తెలుగు భాష అంతరించి పోయే ప్రమాదం ఉందని భాషాభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ తెలిపారు.

భాష అంతరించిపోతే జాతి అంతరించి పోయే ప్రమాదం ఉందని పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివించినా.తెలుగు నేర్పించడంలో తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని సూచించారు.తెలుగువారందరూ నడుం బిగించాలని దీనిలో స్వచ్ఛంద సంస్థలు, అభిమానులు ముఖ్య భూమిక పోషించాలని పవన్ కళ్యాణ్ కోరారు.
తెలుగు భాష పరిరక్షణకు తమ పార్టీ కృషి చేస్తుందని స్పష్టం చేశారు.