ఆంధ్రా ఎంపీలపై పవన్‌ కసరత్తు

పవర్‌స్టార్‌, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఆంధ్రా ఎంపీలను వదిలేలా కనబడటంలేదు.

మొన్న మీడియా సమావేశంలో ఆంధ్రా ఎంపీలను పేర్లు పెట్టి మరీ విమర్శించిన పవన్‌ కళ్యాణ్‌ ఇప్పుడు మరింత ముందుకెళ్లారు.

పవన్‌ మీడియా సమావేశంలో విమర్శించగానే ఆంధ్రా ఎంపీలు విరుచుకుపడిన విషయం తెలిసిందే.కేంద్ర మంత్రి సుజనా చౌదరి సహా ఎంపీలు పవన్‌పై విమర్శలు గుప్పించారు.

నన్ను తిడితే లాభం లేదు.ప్రత్యేక హోదా కోసం పోరాడండి అని కామెంట్‌ చేశారు.

ఎంపీల పనితీరుపై కసరత్తు చేసిన పవన్‌ రాష్ర్ట విభజన సమయంలో వారి పనితీరు ఏమిటో బయటపెట్టారు.విభజన బిల్లుపై పార్లమెంటులో చర్చ జరిగినప్పుడు ఎంతమంది ఎంపీలు అందులో పాల్గొన్నారో పవర్‌స్టార్‌ లెక్కలు తీశారు.

Advertisement

ఈ ఏడాది మార్చి పదిహేడో తేదీన విభజన బిల్లుపై చర్చ జరిగింది.విజయవాడ ఎంపీ కేశినేని నాని పనితీరుపై ట్విట్టర్లో వివరించారు.

విభజనపై చర్చ జరిగినప్పుడు కేవలం ఐదుగురు ఎంపీలే పాల్గొన్నారు.

మిగిలినవారు ఎక్కడ? అని ప్రశ్నించారు.ఆంధ్రాకు ప్రత్యేక హోదాపై మీరు ఎందుకు కేంద్రంపై ఒత్తిడి తేవడంలేదని పవన్‌ ప్రశ్నించడం ఎంపీలకు తప్పుగా అనిపించింది.ఆ ప్రశ్నకు వారు ఇప్పటివరకు సరైన సమాధానం ఇవ్వకుండా ఏవేవో విమర్శలు చేశారు.

నిజానికి పవన్‌ అన్నదాంట్లో తప్పేమీ లేదు.ఎంపీలు సరైన సమాధానం చెప్పకుండా విమర్శలు చేశారంటేనే వారి పనితీరును అనుమానించాల్సి వస్తోంది.

భాజపా మిత్రపక్షం కాబట్టి వారు పార్లమెంటులో నోరు విప్పడంలేదనుకోవాలి.వారు ఈ విషయంపై మాట్లాడాలంటే అధినేత చంద్రబాబు అనుమతి కావాలి.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
గన్నవరంలో వర్షంలో చంద్రబాబు ప్రసంగం..!!

అందుకు ఆయన ఒప్పుకోరు కదా.ఆ విషయం ఎంపీలు చెప్పలేరు.ఏం చెప్పాలో తెలియక, కక్కలేక, మింగలేక విమర్శలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు